Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రమేయం ఉండటంతో సీఎం అరవింద్ కేజ్రీవాల్ (CM Arvind Kejriwal), మంత్రి మనీష్ సిసోడియా అరెస్టయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆప్‌కు మరో షాక్ ఇచ్చే ఘటన చోటుచేసుకుంది. లిక్కర్ స్కామ్ తరహాలోనే మరో స్కామ్ బయటపడింది. ఢిల్లీ జల్ బోర్డ్ ఆధ్వర్యంలో నడిచే 10 మురుగు నీటి శుద్ధ కర్మాగారాలను మరింత అభివృద్ధి చేసేందుకు పలు కంపెనీలు ఆప్ పార్టీకి టెండర్ల కోసం లంచం ఇచ్చినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) గుర్తించింది.
Also Read: హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేవారికి గుడ్ న్యూస్
ఈ నేపథ్యంలో 'ఢిల్లీ జల్ బోర్డు' స్కామ్‌తో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసుకు సంబంధించి బుధవారం రోజున ఢిల్లీ, అహ్మదాబాద్, ముంబయి, హైదరాబాద్‌లో.. ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ స్కామ్‌లో రూ.1,943 కోట్లు అవినీతి జరిగినట్లు ఆరోపిస్తోంది. ఈడీ నమోదు చేసిన కేసు ప్రకారం..' 2022 అక్టోబర్‌లో మూడు జాయింట్ వెంచూర్ కంపెనీలు.. 4 మురుగు నీటి శుద్ధ కర్మాగారాలను (STP) మరింత అభివృద్ధి, అప్‌గ్రేడ్ చేసేందుకు టెండర్లలో పాల్గొన్నాయి. ఒక్కో కంపెనీ టెండర్‌ను పొందాయి. ఆ తర్వాత ఈ మూడు జాయింట్ వెంచర్ కంపెనీలు ఈ నాలుగు ప్లాంట్ల టెండర్లకు సంబంధించి.. హైదరాబాద్‌కు చెందిన యూరోటెక్ ఎన్విరాన్ ప్రైవెట్ లిమిటెటెడ్ అనే కంపెనీకి సబ్‌కాంట్రాక్ట్ ఇచ్చాయి.
ఈ టెండర్లను వెరిఫికేషన్ చేయగా.. ముందుగా ఈ మూడు వెంచర్ కంపెనీలు.. రూ.1546 కోట్లకు నాలుగు టెండర్లను పొందాయి. కానీ ఆ తర్వాత ఈ టెండర్ల ధర సరైన ఆధారాలు లేకుండానే రూ.1,943 కోట్లకు సవరించబడింది. ఈ టెండర్లు దక్కించుకునేందుకు ఆ కంపెనీలు.. ప్రభుత్వ అధికారులకు, మంత్రులకు, బ్యూరోక్రాట్లకు లంచం ఇచ్చాయి. దీంతో ఢిల్లీ జల్ బోర్డు (DJP) కు వచ్చిన లంచం డబ్బులను ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల కోసం ఖర్చు చేసిందని' ఈడీ పేర్కొంది.
Also Read: మీడియా ముందుకు భోలే బాబా.. ఎవరూ తప్పించుకోలేరంటూ షాకింగ్ కామెంట్స్!
ఈ కేసుకు సంబంధించి ఇటీవల నిర్వహించిన సోదాల్లో రూ.41 లక్షల నగదు, నేరారోపణ పత్రాలు, డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ కేసులో ఇరుక్కున్న ఆమ్ ఆద్మీ పార్టీపై.. ఇప్పడు ఢిల్లీ జల్ బోర్డ్ స్కామ్ (Delhi Jal Board Scam) ఆరోపణలు రావడం సంచలనం రేపుతోంది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి మరింత విచారణ జరుగుతోందని అధికారులు పేర్కొన్నారు.