Delhi : డాన్స్ చేస్తూ గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

ఢిల్లీలోని రూప్ నగర్ పోలీస్‌ స్టేషన్‌లో సీనియర్ ఆఫీసర్ బదిలీ అయి వెళ్ళిపోతున్నారు. ఆయనకు టీమ్ మొత్తం వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో డాన్స్ చేస్తూ హెడ్ కానిస్టేబుల్ ఉన్నట్టుండి పడిపోయారు. గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందారు.

New Update
Delhi : డాన్స్ చేస్తూ గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

Constable Ravi Kumar : ఢిల్లీ (Delhi) లో రూప్‌నగర్ పోలీస్ స్టేషన్‌లోజరిగిన ఘటన అక్కడ అందరినీ తీరని దు:ఖంలోకి నెట్టేసింది. ఈ స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు రవికుమార్‌. స్టేషన్‌ హౌస్‌ అధికారి (ఎస్‌హెచ్‌వో) బదిలీ కావడంతో స్టాఫ్ అంతా కలిసి సెండాఫ్​ పార్టీ ఇచ్చారు. దీనిలో పోలీసులందరూ ఉత్సాహంగా పాటు పాడుతూ, డాన్స్‌లు చేశారు. రవికుమార్‌ కూడా సరదాగా డ్యాన్స్‌ చేశారు. ఈ క్రమంలో ఆయనకు ఒక్కసారిగా ఛాతిలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. ఏమైందో తెలియక అతనిని తోటి ఉద్యోగులు అతనిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ రవికుమార్‌‌ను పరీక్షించిన వైద్యులు.. అతను‌ చనిపోయినట్లు ప్రకటించారు. దీంతో అతని మిత్రులతో పాటూ సీనియర్ అధకారులు సైతం ఒక్కసారి షాక్‌ గురైయ్యారు. తమతో పాటూ వర్క్ చేస్తూ...పార్టీలో సరదాగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా చనిపోవడం వారు జీర్ణించుకోలేకపోయారు.

రవికుమార్ 2010లో ఢిల్లీ పోలీస్‌గా విధుల్లో జాయిన్ అయ్యారు. ఇతని వయసు 35 ఏళ్ళు. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 45 రోజుల క్రితమే గుండె పని తీరును తెలిపే యాంజియోగ్రఫీ చేయించుకున్నారు. అప్పుడు ఏ లోపం లేదని కూడా తెలిసింది. కానీ ఇంతలోనే నేను ఇక పని చేయలేను అంటూ ఆగిపోయింది. రవి కుమార్ ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) బాగ్‌పత్‌కు చెందిన వ్యక్తి. దీని తర్వాత రవి చేసిన డాన్స్ వీడియోలు (Dance Videos) ఇప్పుడు సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అయ్యాయి.

Also Read: Paris : పారా ఒలింపిక్స్‌లో అదరగొట్టిన ఆర్మ్‌ లెస్ ఆర్చర్ శీతల్ దేవి

Advertisment
Advertisment
తాజా కథనాలు