Paralympics 2024 : ఎప్పటిలానే పారా అథ్లెట్ శీతల్ దేవి (Sheetal Devi) తన అద్బుత ప్రదర్శనను కొనసాగిస్తోంది. పారిస్ (Paris) లో జరుగుతున్న పారా ఒలింపిక్స్ (Paralympics) లో ఆర్చరీలో మహిళల వ్యక్తిగత కాంపౌండ్‌లో ఓ పెన్ ర్యాంకింగ్ రౌండ్లో గురి చూసిబాణాలను వదిలింది. దీంతో రుఎంవ స్థానంలో నిలిచిన ఆమే పదహారవ రౌండ్‌లోకి నేరుగా ప్రవేశించింది. శీతల్ 720కి 703 పాయింట్లు సాధించి టర్కీకి చెందిన ఓజ్నూర్ గిర్డి క్యూర్ తర్వాత రెండో స్థానంలో నిలిచింది. ఒజ్నూర్ 704 పాయింట్లతో ప్రపంచ రికార్డు సృష్టించింది. శీతల్ ఈ నెలలో గ్రేట్ బ్రిటన్‌కు చెందిన ఫోబ్ పైన్ ప్యాటర్సన్ నెలకొల్పిన 698 ర్యాంకింగ్ రౌండ్‌లో ప్రపంచ రికార్డును అధిగమించింది. తాజాగా.. శీతల్ ను ఓజ్నూర్ అధిగమించడంతో రెండో స్థానంలో నిలిచింది. ర్యాంకింగ్ రౌండ్‌లో శీతల్‌తో సహా మొదటి నాలుగు స్థానాల్లో ఉన్న ఆర్చర్లు 32 రౌండ్‌లో బై పొందారు. ఇప్పుడు వీరందరూ శనివారం 16వ రౌండ్‌లో పాల్గొంటారు.
పూర్తిగా చదవండి..Paris : పారా ఒలింపిక్స్‌లో అదరగొట్టిన ఆర్మ్ లెస్ ఆర్చర్ శీతల్ దేవి
పారిస్ లో జరుగుతున్న పారా ఒలింపిక్స్‌లో ఆర్మ్ లెస్ ఆర్చర్ శీతల్ దేవి అదరగొట్టింది. మహిళల వ్యక్తిగత కాంపౌడ్ ఓపెన్ ర్యాంకింగ్ రౌంలో అద్భుతమైన ప్రదర్శనతో రెండవ స్థానంలో నిలిచింది. దీంతో ఆమె పదహారవ రౌండ్‌లోకి నేరుగా ప్రవేశించింది.
Translate this News: