/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-9-4-jpg.webp)
Singham Again : బాలీవుడ్(Bollywood) నటి దీపికా పడుకొణె(Deepika Padukone) అప్ కమింగ్ మూవీ 'సింగమ్ అగైన్' నుంచి సాలిడ్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కిస్తున్న సినిమాలో అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్, కరీనా కపూర్, టైగర్ ష్రాఫ్, రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అర్జున్ కపూర్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు.
View this post on Instagram
Also Read : ఈ వారం థియేటర్, ఓటీటీ సినిమాలు ఇవే
ఈమె నా హీరో..
అయితే తాజాగా ఈ మూవీ షూటింగ్ మొదలు పెట్టినట్లు చెబుతూ ‘రీల్ అయినా...రియల్ అయినా... ఈమె నా హీరో. లేడీ సింగమ్’(Lady Singham) అనే క్యాప్షన్ తో దీపిక లుక్ విడుదల చేశారు. పోలీస్ దుస్తుల్లో దుర్మార్గులను చెండాడుతున్న రూపంలో దీపిక అదిరిపోయింది. ఇక రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, జియో స్టూడియోస్‌తో కలిసి అజయ్ దేవగణ్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న విడుదలకానుంది.
View this post on Instagram