This Week Movies: ఈ వారం థియేటర్, ఓటీటీ సినిమాలు ఇవే ఈ వారం సినీ ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్ లో అదిరిపోయే చిత్రాలు రాబోతున్నాయి. అలాగే ఓటీటీలోనూ పలు చిత్రాలు, వెబ్ సీరీస్ లు విడుదలకు సిద్ధమయ్యాయి. ఈ సినిమాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. By Archana 22 Apr 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి This Week Movies: ఈ వారం థియేటర్, ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము.. 'రత్నం' హీరో విశాల్, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన తాజా చిత్రం 'రత్నం'. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ మూవీని సింగం ఫేమ్ దర్శకుడు హరి తెరకెక్కించారు. భరణి, పూజ చిత్రాల తర్వాత విశాల్, హరి కాంబోలో రాబోతున్న ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. రత్నం తెలుగు, తమిళ్, భాషల్లో ఏప్రిల్ 26న విడుదల కానుంది. రుస్లాన్ కరణ్.బి దర్శకత్వంలో ఆయుష్ శర్మ, సుశ్రీ మిశ్రా ప్రధాన పాత్రలో రూపొందిన యాక్షన్ ఫిల్మ్ 'రుస్లాన్'. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కె.కె.రాధామోహన్ నిర్మించారు. ఈ సినిమాలో సీనియర్ నటుడు జగపతిబాబు కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రతినిధి 2 దేవగుప్త దర్శకత్వంలో నారా రోహిత్ హీరోగా లేటెస్ట్ చిత్రం ప్రతినిధి 2. 2014 లో విడుదలైన 'ప్రతినిధి' కి సీక్వెల్ గా ఈ మూవీని రూపొందించారు. కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీతోట, సురేంద్రనాథ్ బొల్లినేని సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన 'ప్రతినిధి 2' ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో నారా రోహిత్ నిజాయితీ గల న్యూస్ రిపోర్టర్ కనిపించబోతున్నారు. ఓటీటీ సినిమాలు నెట్‌ఫ్లిక్స్ డెడ్ బాయ్ డిటెక్టివ్స్ (వెబ్‌సిరీస్) - ఏప్రిల్ 25 టిల్లు స్క్వేర్ - ఏప్రిల్ 26 డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఏప్రిల్ 26- కుంగ్‌ఫూ పాండా 4 (యానిమేషన్) ఏప్రిల్ 25- భీమా (తెలుగు) ఏప్రిల్ 26- క్రాక్ (హిందీ) ఏప్రిల్ 26 - ది బీ కీపర్ (హాలీవుడ్) జియో ఏప్రిల్ 22 - ది జెనెక్స్(వెబ్‌సిరీస్) Also Read: Actor Thiruveer: పెళ్లి పీటలు ఎక్కిన ‘మసూద’ నటుడు.. వైరలవుతున్న ఫొటోలు..! #this-week-movies మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి