delhi liquor scam:ఢిల్లీ లిక్కర్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఇంట్లో ఈడీ సోదాలు ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. నార్త్ అవెన్యూలోని ఎంపీ నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. దీంతో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేంద్ర దర్యాప్తు సంస్థ మళ్ళీ దూకుడు పెంచినట్టు అయింది. By Manogna alamuru 04 Oct 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోందా...అంటే అవుననే చెప్పాలి. ఈరోజు తెల్లవారి నుంచి సంజయ్ సింగ్ ఇంట్లో కేంద్ర ద్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నిర్వహిస్తున్న సోదాలే ఇందుకు ఉదాహరణ. మనీ లాండరింగ్ కేసుతో సంబంధం ఉన్న అనుమానంతోనే సోదాలు నిర్వహిస్తున్నామని చెబుతున్నారు ఈడీ అధికారులు. దాంతో పాటూ బిజినెస్ మ్యాన్ దినేశ్ అరోరాతో కూడా సంజయ్ కు సంబంధాలున్నట్లు ఈడీ గుర్తించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో శరత్ చంద్ర రెడ్డి, దినేశ్ అరోరా, మాగుంట రాఘవలు అప్రూవర్లుగా మారి కీలక సమాచారాలు అందించారు. ఈ నేపథ్యంలో సంజయ్ ఇంట సోదాలు ప్రధాన్యతను సంతరించుకున్నాయి. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఈడీ దృస్టిలో ఎప్పటి నుంచో ఉన్నారు. కానీ ఇప్పటి వరకూ అతని మీద ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఇక వ్యాపారవేత్త దినేశ్ అరోరాను సంజయ్ దగ్గరుండి మాజీ మంత్రి మనీశ్ సిసోడియాకు కలిపించాడని ఈడీ ఆరోపిస్తోంది.తాను ఒక కార్యక్రమంలో సంజయ్ సింగ్‌ను కలిశానని, ఆ తర్వాత ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో కూడా సంప్రదింపులు జరిపినట్లు అరోరా ఈడీకి తెలిపారు. ఢిల్లీ ఎన్నికలకు ముందు నిధుల సేకరణ కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దినోష్ అరోరా మొదట సంజయ్ సింగ్ ను కలిశారు. ఎంపీ ద్వారా అన్‌ప్లగ్డ్ కోర్ట్‌యార్డ్‌లో పార్టీలో మనీష్ సిసోడియా కలుసుకున్నాడని ఈడీ అధికారులు చెప్పారు. అంతేకాక దినేశ్‌కు లిక్కర్ డిపార్ట్‌మెంట్‌తో ఎప్పటి నుంచో ఉన్న సమస్యను కూడా సంజయ్ తీర్చారని చెబుతోంది.ఎంపీ సంజయ్ సింగ్ అభ్యర్థన మేర దినేష్ అరోరా ఢిల్లీలో పార్టీ నిధుల సేకరణ కోసం రెస్టారెంట్ల యజమానులు రూ. 32 లక్షల చెక్కులను సిసోడియాకు అప్పగించారని ఈడీ పేర్కొంది. కానీ ఇప్పటివరకూ ఈడీ ఆప్ ఎంపీ పేరును మాత్రం నిందితుల జాబితాలో చేర్చలేదు. ఛార్జ్ సీట్ లో మాత్రమే సంజయ్ పేరు ఉంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అప్రూవర్‌గా మారేందుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవ్ మాగుంట, దినేష్ అరోరాలను మంగళవారం ఢిల్లీ కోర్టు అనుమతించింది. మాజీ డిప్యుటీ సీఎం మనీశ్‌సిసోడియాను ఈ ఏడాది ఫిబ్రవరిలో విచారణకు పిలిచిన సీబీఐ ఆ తర్వాత అరెస్ట్ చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను కూడా తొమ్మిది గంటల పాటూ ఈడీ ప్రశ్నించింది. అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సిఫారసు చేయడంతో మద్యం పాలసీని రద్దు చేశారు. also read:సిక్కింలో ఆకస్మిక వరదలు…23 మంది ఆర్మీ గల్లంతు #delhi #ed #liquor-scam #mp #aap #sanjay-singh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి