ప్రకృతి కోపానికి కేరళలోని వయనాడ్ జిల్లా పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడి బీభత్సం సృష్టించాయి. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 107 మంది మృతి చెందారు. గుర్తు పట్టలేని స్థితిలో మృతదేహాలు ఉన్నాయి. ఈ ఘోర విపత్తులో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. అక్కడ ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఇరవజింజి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ముండక్కై, చురల్మలను అనుసంధానం చేసే వంతెన కొట్టుకుపోయింది. అలాగే ఆగకుండా కురుస్తున్న వర్షాల వల్ల సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది.
Also Read: ఫాస్టాగ్ ప్లేస్‌లో శాటిలైట్ టోల్.. రోడ్ ఎక్కితే చాలు డబ్బులు కట్టాల్సిందే!
కేరళ డిజాస్టర్ మేనేజ్‌మెంట్, NDRF సిబ్బంది, రెండు హెలికాప్టర్లు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ఇదిలాఉండగా.. భారీ వర్షాలకు ముండక్కై, చురల్మల గ్రామాలు పూర్తిగా కొట్టుకుపోయాయి. అట్టమాల, నూల్పూజ గ్రామాలపై కూడా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. తెల్లవారుజామున 2 గంటల నుంచి ఉదయం నాలుగు గంటల మధ్య ఈ ప్రమాదం జరిగింది. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపోతున్నాయి.
Also read: 10 అడుగుల గదికి రూ. 12 వేలు.. ఇదీ సివిల్స్ విద్యార్థుల దుస్థితి