ఒక ఐఏఎస్ అధికారికి సమాజంలో చాలా గౌరవం ఉంటుంది. ఈ ఉద్యోగం సాధించేందుకు చాలామంది విద్యార్థులు పోటీ పడుతుంటారు. లక్ష్య చేధన కోసం పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యేందుకు చాలామంది మహానగరాలకు వెళ్లి లక్షలు పెట్టి కోచింగ్‌లు తీసుకుంటారు. ఇదే అదునుగా భావిస్తున్న కొందరు ఇంటి యజమానులు అద్దెలు ఇష్టం వచ్చినట్లు పెంచేస్తున్నారు. అయితే తాజాగా సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న ఓ విద్యార్థి గదికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పూర్తిగా చదవండి..Watch Video: 10 అడుగుల గదికి రూ. 12 వేలు.. ఇదీ సివిల్స్ విద్యార్థుల దుస్థితి
ఢిల్లీలోని ఓ విద్యార్థి కేవలం 10 అడుగులు పొడవు, వెడల్పు ఉన్న ఇరుకైన గదిలో ఉంటూ సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. ఇలాంటి చిన్న గదికి ఇంటి యజమానులు రూ.12-15 వేలు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Translate this News: