Doordarshan: దూరదర్శన్‌లోకి వచ్చేస్తున్న ఏఐ యాంకర్లు..

మే 26 నాటికి డీడీ కిసాన్ తొమ్మిదేళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలోనే ఏఐ యాంకర్లను ప్రవేశపెట్టనున్నట్లు దూరదర్శన్‌ ప్రకటించింది. ఏఐ క్రిష్, ఏఐ భూమి పేరిట ఇద్దరు యాంకర్లను తీసుకురానున్నట్లు వెల్లడించింది.

New Update
Doordarshan: దూరదర్శన్‌లోకి వచ్చేస్తున్న ఏఐ యాంకర్లు..

అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (AI) రంగం రోజురోజుకు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చాలావరకు కంపెనీలు ఏఐ సేవలు వినియోగించుకుంటున్నాయి. ఆఖరికి పలు న్యూస్‌ ఛానళ్లలో కూడా ఏఐ యాంకర్లు వచ్చేశాయి. అయితే రైతుల కోసం దూరదర్శన్ ఛాన్‌ డీడీ కిసాన్‌ను ప్రారంభించింది. మే 26 నాటికి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలోనే ఏఐ యాంకర్లను ప్రవేశపెట్టనున్నట్లు దూరదర్శన్‌ ప్రకటించింది. ఏఐ క్రిష్, ఏఐ భూమి పేరిట ఇద్దరు యాంకర్లను తీసుకురానున్నట్లు వెల్లడించింది.

Also read: తెలంగాణలో వైన్ షాపులు, బార్లు బంద్!

డీడీ కిసాన్‌ దీనిపై పలు కీలక వివరాలు వెల్లడించింది.' ఈ యాంకర్లు ఏఐ అనుసంధాన కంప్యూటర్లు. ఇవి కూడా మనుషుల్లాగే పనిచేస్తాయి. నిరంతరాయంగా న్యూస్ చదువుతాయి. అన్ని రాష్ట్రాల రైతులు కూడా వీటిని వీక్షించవచ్చు. దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో జరుగుతున్న పరిశోధనలు, మార్కెట్‌లో ధరలు, ప్రభుత్వ పథకాలు.. అలాగే వాతారవరణ అంశాలతో పాటు ప్రతి సమాచారాన్ని అందిస్తాయి. ఈ ఏఐ యాంకర్లు 50 భాషల్లో మాట్లాడగలవు' అని డీడీ కిసాన్ ఓ ప్రకటనలో తెలిపింది.

Also Read: హెలికాప్టర్‌లో సాంకేతికలోపం.. తప్పిన ప్రమాదం

Advertisment
తాజా కథనాలు