గంగవరం పోర్టును జగన్ అమ్మేశారు: పవన్

గంగవరం పోర్టును జగన్ అమ్మేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ ఘాటు విమర్శలు చేశారు. దోపిడీ చేసే వ్యక్తి జగన్‌కు 151 అసెంబ్లీ, 22 ఎంపీలను ఇచ్చారని.. తాను ఓడిపోయినా.. ఇంత ఘనంగా అదరిస్తారా అనిపించిందన్నారు. అన్యాయం జరుగుతున్నపుడు తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు.

New Update
నష్టపోయిన మత్స్యకారులకు అండగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్.!

గంగవరం పోర్టును జగన్అమ్మేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘాటు విమర్శలు చేశారు. దోపిడీ చేసే వ్యక్తి జగన్‌కు 151 అసెంబ్లీ, 22 ఎంపీలను ఇచ్చారని.. తాను ఓడిపోయినా.. ఇంత ఘనంగా అదరిస్తారా అనిపించింది. అన్యాయం జరుగుతున్నపుడు తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. గాజువాకలో ఓడిపోయినా.. తనకు ఘన స్వాగతం పలికారని ఎమోషనల్ అయ్యారు. విశాఖ ఉక్కు కోసం భూములు ఇచ్చిన వారు.. గుడిలో ప్రసాదం తింటున్నారని తెలుస్తోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని జగన్ మాట్లాడారని.. కేంద్రాన్ని నిలదీయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారాహి యాత్రలో భాగంగా గాజువాకలో ఏర్పాటు చేసిన సభలో ఆయన.. తనను ప్రేమతో స్వాగతం పలికిన గాజువాక ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

ప్రైవేటీకరణ వద్దని.. సొంత గనులు కేటాయించామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కోరానని తెలిపారు. తనను మాట్లాడమని అంటున్నారని.. తమకు ఎంపీగా గెలిపించలేదన్నారు. మరి గెలిచిన వైసీపీ ఎంపీలు పార్లమెంటులో ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. కేసులు ఉన్న వాడికి, లూటీ చేసే వాడికి ధైర్యం రాదని.. అందుకే కేంద్రాన్ని ఏం అడగలేక పోతున్నారని విమర్శించారు. ఆంధ్రా ఎంపీలు అంటే..కేంద్రానికి చులకన అని.. అందుకే కేంద్రం ఖాతరు చేయడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో డబ్బులకు ఆశపడకండి.. నిజాయితీ పరులను ఎన్నుకోండని ప్రజలకు పిలుపునిచ్చారు.

తనను వ్యతిరేకించేవారే అయితే ప్రజలు ఇంత భారీ సంఖ్యలో వచ్చేవారు కాదన్నారు. గాజువాక నియోజకవర్గంలో జగన్ లాంటి రాక్షస పార్టీకి చెందిన వారు ఎమ్మెల్యేగా ఉండటం దారుణమన్నారు. తాను ఓడిపోయినా ప్రజల్లోనే ఉంటానని పవన్ స్పష్టం చేశారు. తాను అన్యాయాన్ని అరికట్టాలంటే రాజకీయాల్లోకి వచ్చినట్లు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. ఎప్పటికీ తన ఆశయం, జనసేన ఆశయం ఓడిపోదన్న పవన్‌.. ఉత్తరాంధ్ర నుంచే ప్రజల కోసం పోరాటం చేయడం నేర్చుకున్నానని. 2024 ఎన్నికల అనంతరం గాజువాకలో జనసేన జండా ఎగురడం ఖాయమని పవన్‌ని ప్రదర్శించారు. ఏపీకి విశాఖ స్టీల్ ప్లాంట్‌మన్న జనసేన అధినేత.. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అన్నారు.

Advertisment
తాజా కథనాలు