ICC World Cup:ప్లీజ్ మమ్మల్ని క్షమించండి..ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ తీవ్ర దుఃఖంలో ఉన్న కోట్లాది మంది భారతీయులకు ఆస్ట్రేలియన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ క్షమాపణలు చెప్పాడు. వరల్డ్ కప్ కోసం భారత జట్టు చాలా ప్రయత్నించిందని పొగిడాడు. ఫైనల్ మ్యాచ్ ఒక అద్భుతమని అన్నాడు. By Manogna alamuru 21 Nov 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి వరల్డ్ కప్ అయిపోయి రెండు రోజులు గడుస్తోంది. అయినా ఇంకా ఆ బాధ నుంచి భారతీయులు కోలుకోలేదు. దాని గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు. కోట్లాది మంది భారతీయుల హృదయాలను ముక్కలు చేస్తూ ఇండియన్ టీమ్ చివరి మెట్టు మీద బోల్తీ పడింది. అలాగే మన దేశంలో మన చేతుల్లోంచి కప్ ను లాగేసుకున్న ఆస్ట్రేలియన్ టీమ్ ను కూడా క్షమించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆ టీమ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ట్వీట్ ఒకటి వైరల్ అవుతోంది. భారతీయులూ మమ్మల్ని క్షమించండి అంటూ వార్నర్ ట్వీట్ చేశాడు. Also Read:ఉత్తర గాజాలో ఇండోనేషియన్ ఆసుపత్రిని టార్గెట్ చేసిన ఇజ్రాయెల్ డేవిడ్ వార్నర్...భారతీయులకు బాగా దగ్గరైన ఆస్ట్రేలియన్ క్రికెటర్. భారతీయ సినిమా డైలాగులకు, పాటలకు వార్నర్ చేసే రీల్స్ తో అతనికి చాలా మంది ఫ్యాన్ ఉన్నారు. అతన్ని చాలా మంది ఫాలో కూడా అవుతున్నారు. ఇలాంటి ఒక ఫాలోవర్...భారత్ ఓటమిని తట్టుకోలేక వార్నర్ ను ట్యాగ్ చేస్తూ ఒక పోటస్ట్ పెట్టాడు. నువ్వు కోట్లమంది భారతీయుల గుండెల్ని ముక్కలు చేశావు అంటూ పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ట కు రిప్లయ్ గానే డేవిడ్ వార్నర్ ట్వీట్ చేశాడు. వన్డే ప్రపంచకప్ 2023 గెలిచినందుకు క్షమాపణలు చెప్తున్నా. వరల్డ్ కప్ ఫైనల్ ఒక అద్బుతమైన మ్యాచ్. నరేంద్ర మోడీ స్టేడియంలో వాతావరణం చాలా గొప్పగా అనిపించింది. ఫైనల్స్ లో భారత జట్టు చాలా తీవ్రంగా పోరాడింది. కప్ కోసం చాలా కష్టపడింది. అందరికీ ధన్యవాదాలు అంటూ డేవిడ్ వార్నర్ తన ఎక్స్ ఖాతాలో రాశాడు. తమ టీమ్ వందకోట్ల మంది భారతీయులను బాధ పెట్టిందని...అందుకే సారీ చెప్తున్నానని డేవిడ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. I apologise, it was such a great game and the atmosphere was incredible. India really put on a serious event. Thank you all https://t.co/5XUgHgop6b — David Warner (@davidwarner31) November 20, 2023 #australia #david-warner #indians #tweet #icc-world-cup-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి