ఏపీలో సర్పంచులు ఉత్సవ విగ్రహాలుగా మారారు: పురంధేశ్వరి!

బీజేపీ ఏపీ చీఫ్‌ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత పురంధేశ్వరి రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. ఏపీ పాలన ప్రభుత్వం పై నిత్యం ఏదోక రూపంలో విరుచుకుపడుతున్నారు. తాజాగా ఆమె మరికొన్ని ట్విట్టస్త్రాలు సంధించారు.

BJP Purandeswari: 'ఆడుదాం ఆంధ్ర ఎమో గానీ ఆంధ్రాతో ఆడుకుంటున్నారు'
New Update

Daggubati Purandeswari Comments on YCP : బీజేపీ ఏపీ చీఫ్‌ (AP BJP Chief) గా బాధ్యతలు స్వీకరించిన తరువాత పురంధేశ్వరి రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. ఏపీ పాలన ప్రభుత్వం పై నిత్యం ఏదోక రూపంలో విరుచుకుపడుతున్నారు. తాజాగా ఆమె మరికొన్ని ట్విట్టస్త్రాలు సంధించారు.

అందులో ఆమె ఏపీ సర్పంచుల గురించి ప్రస్తావించారు. ఏపీలో నేడు సర్పంచులు అంతా కూడా ఉత్సవ విగ్రహాలుగా మారారని ఆమె పేర్కొన్నారు. కేంద్రం పంచాయతీలకిచ్చిన నిధులను ఏపీ గవర్నమెంట్‌ పక్క దారి పట్టిస్తుంది.  గ్రామాల అభివృద్ధికి నేడు ప్రభుత్వం తిలోదకాలు వదిలి పెట్టింది.

సుమారు నాలుగున్నరేళ్ల కాలంలో కేంద్రం  రూ.8600 కోట్లు ఏపీలోని గ్రామాలకు ఇచ్చింది. కానీ సర్పంచులు అప్పులు చేసి మరి గ్రామాల అభివృద్దికి పునుకున్నారు.  కానీ బిల్లులు రావడం లేదు. దీంతో కొందరు సర్పంచులు ఆ అప్పులు కట్టలేక..ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

కేంద్ర నిధుల వాటాతో జరిగే అభివృద్ధి పనులు చేసే కాంట్రాక్టర్లకు కూడా కనీసం బిల్లులు మంజూరు చేయడం లేదు. కావాలనే వాటిని ఏపీ ప్రభుత్వం  అడ్డుకుంటొంది. ఏపీ ప్రభుత్వానికి భజన చేస్తూ..వారికి ముడుపులు సమర్పించుకుంటున్నవారికి గ్రీన్‌ ఛానెల్‌ ద్వారా బిల్లులు చెల్లిస్తున్నారు.

వీటికి అన్నింటికి ఏదోక నాడు ఏపీ ప్రభుత్వం కచ్చితంగా సమాధానం చెప్పి తీరాల్సి ఉంటుంది. ఈ నెల పదో తేదీన అన్ని జిల్లాల్లోని సర్పంచులకు అండగా కార్యక్రమాలు చేపడుతున్నాం. జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేపడతాం అని ఆమె ట్విట్లర్‌ లో పోస్ట్ చేశారు.

టీటీడీ ఛైర్మన్‌

ఇది ఇలా ఉంటే..పురంధేశ్వరి టీటీడీ ఛైర్మన్‌ పదవి గురించి కూడా ప్రస్తావించారు. హిందూ ధర్మం పై పూర్తిగా నమ్మకం ఉన్న వారినే టీటీడీ ఛైర్మన్‌ (TTD Chairman) గా నియమించాలని ఆమె పేర్కొన్నారు. అదేసమయంలో ఈ పదవి ఒక రాజకీయ పునరావాస పదవి కారాదన్నారు. హిందూ ధర్మంపై నమ్మకం ఉన్నవాళ్లే ఆ పదవికి న్యాయం చేయగలరని పేర్కొన్నారు.

ఈ మేరకు ఆమె మంగళవారం ట్వీట్ చేశారు. ప్రస్తుతం టీటీడీ ఛైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం సోమవారంతో ముగిసింది. కొత్త ఛైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డిని ఏపీ ప్రభుత్వం నియమించింది. ఈయన టీటీడీ  ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనుండటం ఇది రెండోసారి. గతంలో సీఎంగా వైఎస్ఆర్ ఉన్న సమయంలో కూడా ఆయన ఒకసారి టీటీడీ ఛైర్మన్‌గా పని చేశారు

అలాంటి భూమన కరుణాకర్ రెడ్డి శ్రీవేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఒక నల్లరాయితో పోల్చారు. అప్పట్లో ఈ విషయం పెద్ద వివాదమైంది. ఇపుడు ఆయన్నే టీటీడీ ఛైర్మన్‌గా నియమించడాన్ని అనేక హిందూవాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో దగ్గుబాటి పురంధేశ్వరి ట్వీట్ చేస్తూ, "ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం 80 మంది సభ్యులతో ధర్మకర్తల మండలి నియామకం చేపట్టింది.

దానిపై గళం విప్పిన తర్వాత 52 మంది నియామకం నిలిపివేశారు. ప్రభుత్వం ఈ నియామకాలను రాజకీయ పునరావాసంగానే పరిగణిస్తోందని అర్థమవుతోంది. టీటీడీ ఛైర్మన్‌ పదవికి హిందూ ధర్మంపై నమ్మకం ఉన్నవారిని.. ఆ ధర్మాన్ని అనుసరించేవారినే నియమించాలి. అన్య మతస్తులను కాదు" అని పురందేశ్వరి ట్వీట్‌ చేశారు.

Also Read: నేడు వైఎస్సాఆర్‌ షాదీ తోఫా, కళ్యాణమస్తు నిధుల విడుదల!

#bjp #sarpanch #andhrapradesh #bhumana-karunakar-reddy #yd-jagan #ap-bjp-chief #purandheswari #daggubati-purandeswari-comments-on-ycp #ysrcp #ap-government #ttd
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe