Work From Home Scam : ప్రతి ఒక్కరి చేతిలోకి స్మార్ట్‌ఫోన్లు(Smartphones) వచ్చాక.. విద్యా, ఉద్యోగం, వ్యాపారం ఇలా అన్ని రంగాల్లో వీటి సేవలను వినియోగించుకుంటున్నారు. అయితే ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్ల(Cyber Criminals) మోసాలు కూడా విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మించి ఎంతోమంది యువతీ, యువకుల్ని మోసం చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా మరో విద్యార్థి కూడా ఈ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నాడు. వాళ్లు చెప్పింది నమ్మి రూ.91 వేలు పొగొట్టుకున్నాడు.
Also Read : బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్.. కాంగ్రెస్ గూటికి పట్నం ఫ్యామిలీ!
టాస్కుల పేరుతో జేబు ఖాళీ
అసలేం జరిగిందంటే.. హైదరాబాద్(Hyderabad) లోని నిజాంపేటకు చెందిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థినికి ఈ నెల 2వ తేదిన ఓ మెసేజ్ వచ్చింది. వర్క్ ఫ్రం హోం(Work From Home) పేరుతో సైబర్ నేరగాళ్లు ఇన్‌స్టాగ్రాం(Instagram) కు లింక్ పింపించారు. దానిని ఆమె వాట్సాప్(WhatsApp) ద్వారా షేర్ చేసింది. వివిధ టాస్కుల పేరుతో సైబర్ నేరగాళ్లు ఆమె నుంచి మొత్తం రూ.91 వేలు కాజేశారు. అంతేకాదు పన్నుల రూపంలో మరో రూ.80 వేలు అదనంగా చెల్లించాలంటూ మెసేజ్ పెట్టారు. దీంతో చివరికి ఆమె సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయానని గుర్తించింది.
అప్రమత్తంగా ఉండాలి
ఆ తర్వాత 1930కు తనకు జరిగిన అన్యాయాన్ని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు(Cyber Crime Police) రంగంలోకి దిగారు. కేటుగాళ్లను గుర్తించేందుకు కృషి చేస్తున్నారు. ఇదిలాఉండగా.. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా కూడా చాలామంది అవగాహన లేక కేటుగాళ్ల వలలో చిక్కి.. డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి మోసాలకు గురైతే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.
Also Read : అసెంబ్లీకి కేసీఆర్ రాకపై ఉత్కంఠ.. ఆటోల్లో బయలుదేరిన ఎమ్మెల్యేలు!!