ఓరి కామాంధుడా.. జైలు నుంచి వచ్చి మళ్లీ అదే అమ్మాయిపై రేప్

ఉత్తరప్రదేశ్‌ దుబాగ్గాలో మహిళపై ఓ వ్యక్తి రెండుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అన్షుమౌర్యా గతంలో మహిళను రేప్ చేసి జైలుకు వెళ్లాడు. పోలీసులకు ఫిర్యాదు చేసిందని పగతో అన్షుమౌర్యా బెయిల్‌పై విడుదలై మహిళను మళ్లీ అత్యాచారం చేశాడు.

New Update
Woman raped

ఉత్తరప్రదేశ్‌ లక్నోలో దారుణం చోటుచేసుకుంది. దుబాగ్గాలో మహిళపై ఓ వ్యక్తి రెండుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అన్షుమౌర్యా గతంలో మహిళను రేప్ చేసి జైలుకు వెళ్లాడు. జైలుకు పంపిందన్న పగతో అతను రగిలిపోయాడు. అన్షుమౌర్యా బెయిల్‌పై విడుదలైన వెంటనే మహిళను కిడ్నాప్‌ చేశాడు. జైలుకు పంపిందన్న కక్షతో మహిళపై మళ్లీ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

నిందితుడు అత్యాచారం చేసి మహిళ కాళ్లు, చేతులు కట్టేసి పొదల్లో పడేశాడు. స్థానికులు బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. నిందితుడు అన్షుమౌర్యా కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు