/rtv/media/media_files/2025/04/11/dc7QKCvxNEkQwTClzBPG.jpg)
lover-Rajasthan
రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో జరిగిన ఒక భయంకరమైన హత్య కేసు ఇటీవల వెలుగులోకి వచ్చింది. నసీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటనలో మృతుడి భార్య జనత, ఆమె వికలాంగుడైన ప్రేమికుడు బషీర్‌లను పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు గల కారణాన్ని, దర్యాప్తు పూర్తి వివరాలను అజ్మీర్ ఎస్పీ వందిత రాణా వెల్లడించారు.
నిందితులైన జనత (29), బషీర్ ఖాన్ (29)లకు ఏడాది కింద పరిచయం కాగా.. అది కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది. దీంతో తన భర్త మస్తాన్ (42) పిల్లల్ని కాదని ప్రియుడితో వెళ్లిపోయింది. దీంతో మస్తాన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిద్దరిని తీసుకువచ్చారు. అయితే భర్తతో కంటే ప్రియుడితో కలిసి ఉండాలని భావించిన జనత తన భర్తను చంపాలని అనుకుంది. అందుకు బషీర్ ఖాన్ కూడా ఒప్పుకోలేదు. కానీ ఎలా చంపాలో జనత స్కెచ్ వేసి మరి చూపించింది. దీంతో ప్లాన్ లో భాగంగా మస్తాన్ తాగిన మత్తులో ఉండగా.. బషీర్ అతనిని కత్తితో గొంతు కోసాడని ఎస్పీ తెలిపారు.
విపరీతంగా ఏడుస్తూ నటన
మస్తాన్ మరణం గురించి పోలీసులు అతని భార్య జనతకు తెలియజేసినప్పుడు, ఆమె విపరీతంగా ఏడవడం ప్రారంభించింది. ఆమె నటనను చూసిన పోలీసులు మొదట్లో ఆమెను అనుమానించలేదు. కుటుంబ కలహాల కారణంగా ఎవరైనా మస్తాన్‌ను హత్య చేసి ఉండవచ్చని ఊహించారు. అయితే దర్యాప్తు సాగుతుండగా పోలీసులకు ఒక ఆశ్చర్యకరమైన నిజం తెలిసింది. దర్యాప్తులో, జనతాకు, స్థానిక ఈ-మిత్రా ఆపరేటర్ అయిన వికలాంగుడు బషీర్‌కు మధ్య అక్రమ సంబంధం ఉందని పోలీసులకు సమాచారం అందింది. ఈ సంబంధమే హత్యకు ప్రధాన కారణమని తేలింది. నసీరాబాద్ పోలీసులు కేవలం 48 గంటల్లోనే కేసును ఛేదించారు. ఏప్రిల్ 10, 2025న కోర్టులో హాజరుపరిచారు.ఈ సంఘటన స్థానికుల్లో తీవ్ర దిగ్భ్రాంతి, ఆగ్రహాన్ని కలిగించింది.
Also Read : Alahabad: అత్యాచారం చేయడానికి కారణం ఆమే..అలహాబాద్ హైకోర్టు మరో సంచలన తీర్పు