Hyderabad : దుండిగల్ లో కారు బీభత్సం.. అతి వేగంతో విగ్రహాన్ని ఢీకొట్టి..ఒకరు మృతి!
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దుండిగల్ నుంచి నాగళూరు కు వెళ్లే దారిలో కారు అతివేగంతో పూలే విగ్రహాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా..మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.