విశాఖలో దారుణం.. వేధింపులు భరించలేక టీచర్ ఆత్మహత్య యువకుడు ప్రేమ వేధింపులు భరించలేక టీచర్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖలోని భీమిలిలో చోటుచేసుకుంది. ఓ స్కూల్‌లో విద్యా వాలంటీర్‌గా చేస్తున్న ఆమెను అదే గ్రామానికి చెందిన యువకుడు ప్రేమించమని బలవంతం పెట్టడంతో ఈ దారుణం జరిగింది. By Kusuma 24 Nov 2024 | నవీకరించబడింది పై 24 Nov 2024 09:12 IST in క్రైం ఆంధ్రప్రదేశ్ New Update షేర్ చేయండి ఏపీలోని విశాఖలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. భీమిలికి చెందిన కాగితాల రాశి అనే యువతి డిగ్రీ చదివి.. ప్రస్తుతం ఓ స్కూల్‌లో ఓ స్కూల్‌లో విద్యా వాలంటీర్‌గా చేస్తోంది. అదే గ్రామంలో నివసిస్తున్న పిల్లి రాజు అనే యువకుడు ప్రేమ పేరుతో ఆమెను వేధించాడు. ప్రేమిస్తున్నానని, తన ప్రేమను అంగీకరించాలని ఎక్కువగా వేధించాడు. ఇది కూడా చూడండి: MH: మహారాష్ట్రలో పని చేసిన పవన్ ప్రచారం..ఒక్క చోట మాత్రం.. ప్రేమ వేధింపులు భరించలేక.. ఇవన్నీ ఇష్టం లేదని చెప్పిన కూడా అతను వేధించడం మాత్రం ఆపలేదు. దీంతో ఆ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. వెంటనే ఆ యువతిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స తీసుకుంటూ ఆమె మృతి చెందింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆ యువకుడిపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇది కూడా చూడండి: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు ఇదిలా ఉండగా.. రాజస్థాన్‌లోని బలోత్రా జిల్లాలో ఓ యువతిని సొంత కుటుంబ సభ్యులే నడిరోడ్డుపై కిడ్నాప్ చేశారు. కులాంతర వివాహం చేసుకున్నందున ఆమెను కుటుంబ సభ్యులు రోడ్డు మీద ఈడ్చుకెళ్లి వేరే వాహనంలోకి ఎక్కించిన దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇది కూడా చూడండి: నేడే ఐపీఎల్ మెగా వేలం.. ఏ ఫ్రాంఛైజీ దగ్గర ఎంత ఉందంటే? ఆటోలో కూర్చున్న ఆ యువతని నడిరోడ్డుపై కొట్టి ఈడ్చుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో పోలీసులు ఆమె కుటుంబ సభ్యులతో పాటు మరో తొమ్మిది మందిని అరెస్ట్ చేసి, ఆ యువతిని రక్షించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో పోలీసులు ఆమె కుటుంబ సభ్యులతో పాటు మరో తొమ్మిది మందిని అరెస్ట్ చేసి, ఆ యువతిని రక్షించారు. ఇది కూడా చూడండి: పక్కా ప్లాన్ ప్రకారమే జరిగింది..చంద్రబాబుపై రాళ్ల దాడి కేసులో సంచలనాలు #suicide మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి