అది చిన్న సరదా.. స్టార్క్ కవ్వింపుపై స్పందించిన హర్షిత్ రాణా!

ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ స్టార్క్ కవ్వింపు చర్యపై భారత బౌలర్ హర్షిత్ రానా క్లారిటీ ఇచ్చాడు. 'స్టార్క్‌ నాకు మంచి స్నేహితుడు. ఐపీఎల్‌లో మేమిద్దరం కలిసి ఆడాం. గ్రౌండ్ లో ఇలాంటివి కామన్. ఇదేం పెద్ద విషయం కాదు. చిన్న సరదా' అని చెప్పాడు. 

New Update
rerrr

Ind vs Aus: ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ స్టార్క్ కవ్వింపు చర్యపై భారత బౌలర్ హర్షిత్ రానా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో వీరిద్దరి మధ్య ఆసక్తికర సంఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఆస్ట్రేలియా 104 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లంతా తక్కువ స్కోరుకే ఔట్ కాగా.. మిచెల్ స్టార్క్ ఒక్కడే 26 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 

నీ కంటే వేగంగా బౌలింగ్‌ చేయగలను.

అయితే హర్షిత్ రాణా.. స్టార్క్‌కు బౌలింగ్‌ చేసినపుడు బౌన్సర్లతో ఇబ్బంది పెట్టాడు. ఈ క్రమంలోనే ‘హర్షిత్‌.. నేను నీ కంటే వేగంగా బౌలింగ్‌ చేయగలను. పాత జ్ఞాపకాలు గుర్తున్నాయి’ అంటూ స్టార్క్ కామెంట్ చేశాడు. దీంతో వెంటనే హర్షిత్‌ నవ్వుతూ అలాగే అన్నట్లు తల ఊపాడు. ఇందుకు సంబంధించి వీడియో వైరల్ కాగా క్రికెట్ లవర్స్ కామెంట్ల వర్షం కురిపించారు. దీంతో మరోసారి రియాక్ట్ అయిన హర్షిత్ క్లారిటీ ఇచ్చాడు. 

ఇది కూడా చదవండి: BREAKING: మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

‘స్టార్క్‌ నాకు మంచి స్నేహితుడు. ఐపీఎల్‌లో మేమిద్దరం కలిసి ఆడాం. గ్రౌండ్ లో ఇలాంటివి కామన్. ఇదేం పెద్ద విషయం కాదు. చిన్న సరదా సంభాషణ' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో హర్షిత్ మొత్తం మూడు వికెట్లు పడగొట్టగా.. అందులో కీలకమైన ట్రావిస్ హెడ్ (11) వికెట్ కూడా ఉంది. స్టంప్స్‌ను లక్ష్యంగా చేసుకుని బౌలింగ్‌ చేయాలనే ఆలోచనతోనే హెడ్ వికెట్ తీసినట్లు చెప్పాడు. 

ఇది కూడా చదవండి: Balayya : రామ్ చరణ్ ను ఫాలో అవుతున్న బాలయ్య.. వర్కౌట్ అవుతుందా?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు