TG Crime: తెలంగాణలో మరో ఘోరం జరిగింది. జనగామ జిల్లాలో పెళ్లి కావట్లేదని-- ఏఆర్ మహిళా కానిస్టేబుల్ సూసైడ్ చేసుకుంది. --వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో ఆర్మ్‌డ్ రిజర్వ్‌గా విధులు నిర్వహిస్తున్న నీలిమ ఇంట్లో ఉరేసుకుని చనిపోయింది.
అందరితోనూ సరదాగానే..
ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొడకండ్ల మండలం నీలిబండ తండాకు చెందిన నీలిమ 2020 బ్యాచ్. ప్రస్తుతం వరంగల్ కమిషనరేట్‌లో ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తోంది. ఆమె ఉద్యోగంలో చేరినప్పటినుంచి క్రమశిక్షణగా పనిచేస్తుండేది. అందరితోనూ స్నేహంగా నడుచుకునేంది. అయితే ఆదివారం రోజు తన నివాసంలో ఆత్మహత్య చేసుకుంది.
Also Read: అక్టోబర్ నుండి ఛార్జ్ తీసుకోనున్న సిన్సియర్ పోలీస్ ఆఫీసర్..
అయితే ఇటీవల వరుసగా పెళ్లి సంబంధాలు చూస్తున్న నీలిమకు ఎక్కడా కుదరట్లేదు. దీంతో ఆలసిపోయి కొద్దిగా గ్యాప్ తీసుకుని మళ్లీ ప్రయత్నించింది. కానీ ఎవరు ఆమెను చేసుకునేందుకు ఆసక్తి చూపట్లేదని మనస్తాపం చెందింది. దీంతో అవమానంగా భావించిన నీలిమ బలవన్మరణానికి పాల్పడినట్లు స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపిగా.. కొడకండ్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
Also Read: 'చూపుల్తో గుచ్చి గుచ్చి’ మాస్ జాతర ప్రోమో సాంగ్ అదిరిపోయిందిగా..!
conistable | sucide | marriage | telugu-news | today telugu news
Follow Us