Vizag Crime: విశాఖ జిల్లా గాజువాకలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కనీస విచక్షణ కోల్పోయిన ఓ యువకుడు.. యువతి స్నానం చేస్తుండగా వీడియోలు తీశాడు. ఇది గమనించిన యువతి ఒక్కసారిగా కేకలు వేసింది. వెంటనే యువకుడిని పట్టుకున్న కుటుంబ సభ్యులు, స్థానికులు అతడిని చితకబాదారు. తండ్రికి సమాచారం ఇస్తామని చెప్పి గదిలో బంధించారు. దీంతో తీవ్ర ఆందోళనకు, అవమానానికి గురైన నిందితుడు గదిలోనే ఫ్యాన్ కి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
Also Read: RC16: 20 ఏళ్ళు వెనక్కి వెళ్లి.. RC16 షూటింగ్ కోసం బుచ్చిబాబు పెద్ద ప్లానింగ్!
బాత్రూం లో స్నానం చేస్తుండగా..
పోలీసుల వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లాకు చెందిన భాస్కర్ రావు ఫార్మాసిటీలోని ఓ కంపెనీలో ల్యాబ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. గాజువాక శ్రీనగర్ కాలనీలో యువతి తాతయ్య ఇంట్లో రెంటుకు ఉంటూ ఉద్యోగానికి వెళ్తున్నాడు. అయితే కొద్దిరోజుల క్రితమే ఓనర్ మనవరాలు ఊరు నుంచి అక్కడికి వచ్చింది. ఈ క్రమంలోనే ఆమె నిన్న బాత్రూం లో స్నానం చేస్తుండగా భాస్కర్ రావు వీడియో తీశాడు. ఇది గమనించిన యువతి ఒక్కసారిగా కేకలు వేసింది.అయితే ఫస్ట్ ఫ్లోర్ లోని ఓనర్ బాత్రూమ్ కొంత ఓపెన్ గా ఉంటుంది.
Also Read: ANUJA: ఓటీటీలో ఆస్కార్ నామినేటెడ్ షార్ట్ ఫిల్మ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
యువతి అరవడంతో భాస్కర్ రావు వెంటనే గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అక్కడికి చేరుకున్న యువతి బంధువులు, స్థానికులు అతడిని బాగా కొట్టారు. ఫోన్ లో నుంచి వీడియోలు డిలీట్ చేశారు. మీ తలిదండ్రులకు సమాచారం అందిస్తామని చెప్పి నిందితుడిని గదిలో బంధించారు. దీంతో తీవ్ర అవమానం, ఆందోళనకు గురైన భాస్కర్ రావు రూమ్ లోని కేబుల్ వైర్లతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు అమ్మాయి బంధువులే తన కొడుకును కొట్టి చంపేశారని భాస్కర్ రావు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో ఇప్పటికే యువతికి సంబంధించిన ఐదుగురు బంధువులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read: Vijay Sethupathi: తమిళంలో పాన్ కార్డు మార్చాలి.. స్టార్ హీరో రిక్వెస్ట్ .. ఎందుకిలా?