/rtv/media/media_files/2025/05/26/3Tsc6PTa1Ybd6zQlpoM2.jpg)
Uttar pradesh Soup
హైదరాబాద్‌లో గురుమూర్తి వ్యక్తి తన భార్యను ముక్కలుగా కట్ చేసి కుక్కర్‌లో ఉడికించిన ఘటన అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో మరో ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఓ సీరియల్ కిల్లర్ మనిషిని చంపి తలను వండి సూప్ తయారు చేసుకుని తాగిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఇద్దరు వ్యక్తులను హత్య చేసిన కేసులో పోలీసులు ఉత్తరప్రదేశ్‌కు చెందిన సీరియల్ కిల్లర్ రామ్ నిరంజన్ అలియాస్ రాజా కోలందర్, అతడి సహచరుడు బక్ష్‌రాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇది కూడా చూడండి: Sheikh Hasina: బంగ్లాదేశ్‌ను అమెరికాకు అమ్మేస్తున్నారు.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు
ఫామ్ హౌస్‌కు వెళ్లగా..
ప్రయాగ్‌రాజ్‌కు చెందిన జర్నలిస్టు ధీరేంద్రసింగ్ హత్యకేసులో వీరిపై కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయంలో దర్యాప్తు కోసం ఫామ్ హౌస్‌కు వెళ్లగా.. అక్కడ మనుషుల పుర్రెలు కనిపించాయి. వీటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు కోలందర్‌ను అడిగారు. అప్పుడే మనోజ్ అనే వ్యక్తిని, అతడి డ్రైవరు రవిని తానే హత్య చేసినట్లు కోలందర్ ఒప్పుకున్నాడు. వారి మృతదేహాలను ముక్కలుగా నరికి పూడ్చిపెట్టినట్లు కోలందర్, బక్ష్‌రాజ్ తెలిపారు.
ఇది కూడా చూడండి: BIG BREAKING: సంచలన అప్‌డేట్.. పుతిన్ హెలికాప్టర్‌పై ఉక్రెయిన్ బాంబు దాడి !
జర్నలిస్ట్ ధీరేంద్రను పిప్రీలోని తన ఫామ్‌హౌస్‌కు పిలిపించి చంపినట్లు కోలందర్ ఒప్పుకున్నాడు. ఇలా మొత్తం 14 హత్యలు చేయడంతో అతనికి, బక్ష్‌రాజ్‌కి కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే కోలందర్ నరమాంస భక్షకుడని, మనిషి తలతో చేసిన సూప్ తాగడానికి ఇష్టపడేవాడని పోలీసుల విచారణలో తేలింది. ఇన్ని తప్పులు చేసినా కూడా కోలందర్‌లో ఎలాంటి పశ్చాతాపం కనిపించలేదు. జడ్జి శిక్ష విధిస్తున్న కూడా నవ్వుతున్నాడని పోలీసులు తెలిపారు.
ఇది కూడా చూడండి: BJP Leader Video viral: యువతితో అడ్డంగా బుక్కైన మరో BJP లీడర్.. ఈసారి పార్టీ ఆఫీస్‌లోనే (VIDEO)
ఇది కూడా చూడండి: SRH VS KKR: హ్యాట్రిక్ విజయం..కేకేఆర్ ను చిత్తు చేసిన ఎస్ఆర్హెచ్
soup | hyderabad | Uttar Pradesh