Triple Talaq : ఫోన్‌లో భర్త ట్రిపుల్ తలాక్.. భార్య ఆత్మహత్య!

పెళ్లయినప్పటి నుంచి అత్తమామలు వరకట్న వేధింపులకు గురిచేయడం, కట్టుకున్న భర్త ఫోన్ లో ట్రిపుల్ తలాక్ చెప్పడంతో భరించలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో చోటుచేసుకుంది.

New Update
Tripule talaq

Tripule talaq

పెళ్లయినప్పటి నుంచి అత్తమామలు వరకట్న వేధింపులకు గురిచేయడం, కట్టుకున్న భర్త ఫోన్ లో ట్రిపుల్ తలాక్ చెప్పడంతో భరించలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో చోటుచేసుకుంది. వరకట్న వేధింపులకు సంబంధించి  వివాహిత ఫిర్యాదుపై కేసు నమోదు చేయడంలో విఫలమైనందుకు పోలీసులు ఒక సబ్-ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేసి, శాఖాపరమైన విచారణకు ఉన్నాతాధికారులు ఆదేశించారు.  బాధితురాలు సానియా తత్లి ఆసియా ఆమె అత్తామామలపై చౌరా చౌరీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే ఆమె ఫిర్యాదుపై ఎస్ఐ ఈ ఫిర్యాదుని తోసిపుచ్చారు. కేసు నమోదు చేయలేదని అతడిని సస్పెండ్ చేశారు.

Also Read :  Bus Driver Namaz : నమాజ్ చేయడానికి బస్సు ఆపిన డ్రైవర్.. బిగ్ షాకిచ్చిన ఆర్టీసీ!

ప్రతిరోజూ గొడవలు

గోరఖ్‌పూర్‌లోని చౌరీ చౌరా నగర్ పంచాయతీలోని మూడవ వార్డు రవిదాస్ నగర్ నివాసి అయిన నస్రుద్దీన్ కుమార్తె సానియా (వయస్సు 21)కు  రెండేళ్ల క్రితం 7 ఆగస్టు 2023న ముంబై నివాసి సలావుద్దీన్‌తో వివాహం జరిగింది.  మొత్తం కుటుంబం ముంబైలో నివసిస్తున్నారు. భార్యభర్తల మధ్య ప్రతిరోజూ గొడవలు జరిగేవని బాధితురాలు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తన భర్త చిత్రహింసలకు సానియా చాలా బాధపడిందన్నారు. ఈ సమయంలో తమ కూతురు భర్త ఆమెకు ఫోన్ ద్వారా ట్రిపుల్ తలాక్ అని చెప్పి విడాకులు ఇచ్చాడని తెలిపారు.తన భర్త వేధింపుల గురించి సానియా తల్లి గతంలో ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అక్కడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సానియా భర్త సలావుద్దీన్‌తో సహా  అతని కుటుంబంలోని 8 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది.

Also read :  Namaz : విద్యార్థులను నమాజ్ చేయమని బలవంతం.. ప్రొఫెసర్ అరెస్టు!

Also read :  India-Pak Border: టెన్షన్.. టెన్షన్.. సరిహద్దుల్లో మరో ఉగ్రకుట్ర భగ్నం

Also read :  Marriage Cancel : కాబోయే భార్యకు లవర్ ఉన్నాడని ..పెళ్లి పీటల మీద ట్విస్ట్ ఇచ్చిన వరుడు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు