/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/murder-1-jpg.webp)
UP Wife murder planned for her husband
Crime news: బావ ఆస్తిపై కన్నేసిన బావమరిది దారుణానికి పాల్పడ్డాడు. రైల్వే ఉద్యోగి అయిన బావను లేపేసి అక్కకు ఉద్యోగం ఇప్పించి, తాను ఆస్తిలో షేర్ తీసుకోవాలని కుట్ర పన్నాడు. అక్కతో కలిసి మర్డర్ స్కెచ్ వేశాడు. ఇందుకోసం మరికొంతమంది సాయం తీసుకోవాలని ప్లాన్ చేశాడు. ఫోన్ లో నిత్యం ఎలా చంపాలనే చర్చలు చేస్తుండగా అనుకోకుండా ఈ విషయం తెలిసిన బావ ప్రాణభయంతో పోలీసులను ఆశ్రయించాడు. అమానవీయఘటన ఉత్తరప్రదేశ్ మేరట్ లో జరగగా వివరాలు ఇలా ఉన్నాయి.
సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్..
బిహార్‌లోని గయాకు చెందిన సుమిత్ కుమార్ రైల్వేలో సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్‌గా పనిచేస్తున్నాడు. అయితే కొంతకాలంగా తన ఆస్తి, ఉద్యోగం మీద కన్నేసిన అత్తగారి ఫ్యామిలీ తనను చంపేందుకు కుట్ర చేస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భార్య, బావమరిది తనను చంపుతామని బెదిరిస్తున్నారని కంప్లైంట్ ఇచ్చాడు. ఇప్పటికే వారిద్దరు తనపై భౌతికదాడికి పాల్పడినట్లు ఆందోళన వ్యక్తం చేశాడు. ఇటీవల జరిగిన మేరఠ్ హత్య ఘటన తరహాలో తనను చంపేందుకు ప్లాన్ చేసినట్లు వారు మాట్లాడుకుంటుండగా విన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడని పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తామని పోలీసులు తెలిపారు.
Also Read: Telangana: తెలంగాణలో ద్రోణి ప్రభావం... మరో 2 రోజులు వానలు.. పిడుగులు!
ఇదిలా ఉంటే.. రాజస్థాన్ లో ఓ 17 ఏళ్ల ఓ బాలుడిని కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన లాలిబాయి మోగియా అనే మహిళ(30)కు బుండీ పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2023 నవంబర్ 7న ఈ ఘటన జరగగా, బాధితుడి తల్లి అప్పట్లో పోలీసుల్ని ఆశ్రయించింది. బాధితురాలి తల్లి ఆరోపిస్తూ నిందితురాలు ఒక హోటల్ గదికి తమ కుమారుడిని తీసుకువెళ్లి అక్కగ మద్యం తాగించి ఆరు నుంచి ఏడు రోజుల పాటు లైంగిక దాడికి పాల్పడిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
railway-employee | telugu-news | today telugu news