/rtv/media/media_files/2024/11/05/id8litA7yPAhjlG9maZX.jpg)
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుదేరా వద్ద హైవేపై ఓ వాహనాన్ని బైక్ ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు స్పాట్‌లోనే మృతి చెందారు. మృతులు అందరూ కూడా ఒకే కుటుంబానికి చెందినట్లుగా తెలుస్తోంది. మృతుల్లో ఓ మహిళ కూడా ఉంది. అయితే ఈ ప్రమాదం గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇది కూడా చూడండి: TG JOBS: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో 50 వేల ఉద్యోగాలకు సీఎం గ్రీన్ సిగ్నల్!
ఇదిలా ఉండగా ఇటీవల సూర్యాపేట జిల్లాలో కూడా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అన్నదమ్ములు మృతి చెందారు. ఈ విషాద ఘటన ఆత్మకూరు మండలంలో కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రహీంఖాన్ పేట్‌కు చెందిన గూడూరు చంద్రశేఖర్, మత్సగిరి సోమవారం రాత్రి బంధువుల ఇంటి నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్నారు. కీసర దగ్గరకు రాగానే రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
ఇది కూడా చూడండి: This Week Movies: మహాశివరాత్రి స్పెషల్.. థియేటర్, ఓటీటీలో సినిమాల జాతర! లిస్ట్ ఇదే
అన్నతమ్ములిద్దరూ ఒకేసారి మృతి చెందడంతో..
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరు గురించి స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఇద్దరు మృతదేహాలను పోర్టు మార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు అన్నదమ్ములు ఒకేసారి మృతి చెందడంతో గ్రామంలో, వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇది కూడా చూడండి: Breaking News : కాంగ్రెస్ మాజీ ఎంపీకి బిగ్ షాక్.. ఢిల్లీ కోర్టు జీవిత ఖైదు!