శబరిమల యాత్రికులకు గుడ్‌న్యూస్.. దర్శనానికి ప్రత్యేక పోర్టల్

శబరిమల అయ్యప్పను సులభంగా దర్శించుకునేందుకు భక్తుల కోసం 'శబరిమల పోలీస్ గైడ్' అనే ప్రత్యేక పోర్టల్‌ను కేరళ పోలీసులు తీసుకొచ్చారు. ఆంగ్ల భాషలో ఉండే ఈ పోర్టల్‌లో పోలీసుల హెల్ప్‌లైన్ నంబర్లు, ఆరోగ్య సేవలు ఇలా అన్ని వివరాలు ఉంటాయి.

New Update
Sabarimala86

శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు కేరళ పోలీసులు గుడ్ న్యూస్ తెలిపారు. అయ్యప్ప మాళ వేసిన భక్తులు తప్పకుండా శబరిమళను దర్శించుకుంటారు. ఈ క్రమంలో దర్శనానికి వెళేటప్పుడు భక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే ఈ మండలం మకరవిళక్కు యాత్రకు వెళ్లే భక్తులకు సులభంగా దర్శనం అయ్యేందుకు కేరళ పోలీసులు ప్రత్యేక పోర్టల్‌ను తీసుకొచ్చారు.

ఇది కూడా చూడండి: తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు మరో 28 స్పెషల్ ట్రైన్లు

భక్తులకు సులభంగా దర్శనమయ్యేలా..

శబరిమల పోలీస్ గైడ్ అనే ఒక పోర్టల్‌‌ను భక్తుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ పోర్టల్ సాయంతో భక్తులు సులభంగా దర్శనం చేసుకోవచ్చు. ఆంగ్ల భాషలో ఉండే ఈ పోర్టల్‌లో పోలీసుల హెల్ప్‌లైన్ నంబర్లు, ఆరోగ్య సేవలు, పోలీస్ స్టేషన్ల నంబర్లు, అంబులెన్సు, అగ్నిమాపక దళం, ఫుడ్ సెఫ్టీ, కేఎస్‌ఆర్టీసీ, శబరిమళ వివరాలు, చరిత్ర, వాహనాలు పార్కింగ్, రోడ్డు, రైలు, వాయు మార్గాల వివరాలు అన్ని కూడా పొందుపరిచారు. భక్తులకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ పోర్టల్ ద్వారా సంప్రదించవచ్చు. 

ఇది కూడా చూడండి: యూన్‌‌పై అభిశంసన తీర్మానం.. ఎమర్జెన్సీతో పదవికి ముప్పు

ఇదిలా ఉండగా భక్తులకు ప్రయాణాల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఇటీవల కొత్త రైళ్లను కూడా దక్షిణ రైల్వే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఇప్పటికే పలు స్పెషల్ ట్రైన్లను దక్షిణ మధ్య రైల్వే నడుపుతోంది. ఈ క్రమంలోనే తాజాగా మరికొన్ని రోజుల్లో 28 స్పెషల్ ట్రైన్లను నడపనున్నట్లు  దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. 

ఇది కూడా చూడండి: ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్‌లైన్స్ ఇదే!

ఈ 28 రైళ్లు తెలుగు రాష్ట్రాల నుంచి నడవనున్నట్లు అధికారులు చెప్పారు.  ఈ స్పెషల్ ట్రైన్లకు సంబంధించిన టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ శుక్రవారం ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లు తెలంగాణలోని మౌలాలి, కాచిగూడ నుంచి నడుస్తాయని సమచారం.

ఇది కూడా చూడండి:  పుష్ప-2 ప్రీమియర్ షోలో విషాదం.. ఒకరు మృతి

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు