/rtv/media/media_files/2025/04/16/YvCPI2GQFXGzQ3u4qfUU.jpg)
mallishwari
ప్రేమించిన యువకుడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివారల్లోకి వెళ్తే.. మిర్యాలగూడ బొక్కనుంతలపాడు గ్రామానికి చెందిన మల్లీశ్వరి నిమ్స్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తు్ంది. మధురపురి కాలనీలోని హాస్టల్‌లో ఉంటుంది. అయితే గత కొన్నేళ్లుగా ఆమె అదే గ్రామానికి చెందిన జానారెడ్డితో ప్రేమలో ఉంది. అయితే మల్లీశ్వరి కులం వేరే కావడంతో జానారెడ్డి కుటుంబ సభ్యులు పెళ్లికి ఒప్పుకోలేదు.
Also read : TG 10th Results: తెలంగాణ టెన్త్ ఫలితాలపై బిగ్ అప్‌డేట్.. అది తేలితేనే ఫలితాలు !
Also read : Zaheer Khan: పెళ్లైన ఎనిమిదేళ్లకు గుడ్ న్యూస్.. తండ్రైన జహీర్ ఖాన్!
మల్లీశ్వరి కులం వేరే కావడంతో
దీనికి తోడు ఇటీవల జానారెడ్డికి మరో యువతితో పెళ్లి జరిగింది. ఈ విషయం తెలుసుకున్న మల్లీశ్వరి తాను ఉంటున్న హాస్టల్ లో మత్తు ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన చావుకు కారణం 9 మంది అని, వారి పేర్లు మెసేజ్ పెట్టినట్లు తెలిపింది. మల్లీశ్వరి స్వగ్రామమైన బొక్కమంతలపాడుకు మృతదేహాన్ని తరలించి ఆమె మృతికి కారణమైన జాన్ రెడ్డి ఇంటి ముందు మృతదేహాన్ని ఉంచి న్యాయం చేయాలంటూ సోమవారం అర్ధరాత్రి దాటేవరకు ధర్నా నిర్వహించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు జానారెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
Also read : Teeth Brush: ప్రతిరోజూ సరిగ్గా పళ్లు తోముకోకపోతే ఈ 5 ప్రాణాంతక వ్యాధులు వస్తాయి
Also read : పెళ్లై రెండేళ్లైనా.. విశాఖలో గర్భిణి దారుణ హత్య కేసులో సంచలన విషయాలు!