/rtv/media/media_files/2025/09/30/software-couple-suicide-2025-09-30-12-07-11.jpg)
software couple suicide
పెళ్ళైన మూడేళ్లకే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దంపతులు ఆత్మహత్య(Software Couple Suicide) స్థానికంగా కలకలం సృష్టించింది. భర్త, తన భార్యను చంపి.. ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన గురుగ్రామ్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ కి చెందిన అజయ్ కుమార్ వెస్ట్ బెంగాల్, అసన్సోల్ కి చెందిన స్వీటీ శర్మకు మూడేళ్ళ క్రితం వివాహం జరిగింది. వీరిద్దరూ కూడా ఇద్దరూ గురుగ్రామ్‌లోని ఒక ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు.
Also Read : హైదరాబాద్ బతుకమ్మ వేడుకల్లో విషాదం.. షాక్‌తో స్పాట్లో ముగ్గురు..!
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల ఆత్మహత్య
అయితే ఆదివారం మధ్యాహ్నం సుమారు 3.15 గంటలకు, అజయ్ కుమార్ తన స్నేహితుడికి ఒక వీడియో మెసేజ్ పంపించాడు. అందులో తాను ఆత్మహత్య చేసుకోబోతున్నానని, భార్య స్వీటీతో గొడవ జరిగిందని తెలిపాడు. దీంతో అజయ్ ఫ్రెండ్ వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు.
ఈ మేరకు పోలీసులు సెక్టార్ 37 లోని అజయ్ - స్వీటీ దంపతుల నివాసానికి చేరుకున్నారు. ఫ్లాట్ లోకి వెళ్ళి చూడగానే స్వీటీ శర్మ మృతదేహం నేలపై పడి ఉంది. స్కార్ఫ్ తో ఆమెను ఉరేసి చంపినట్లు పోలీసులు గుర్తించారు.
ఆతర్వాత అజయ్ కుమార్ సీలింగ్ ఫ్యాన్‌కు హ్యాంగ్ చేసుకొని కనిపించాడు.
Gurugram techie dies by suicide after murdering wife, friend from Bengaluru alerts police after receiving video.
— MUKTII (@dyatlov75) September 30, 2025
According to authorities on Monday, a 33-year-old software programmer killed his wife, a fellow techie at a global IT company, before taking his own life at their… pic.twitter.com/xZcDXkfJIe
అయితే మొదట అజయ్ కుమార్ తన భార్యను చంపి, ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. భార్యను హత్య చేసి, అజయ్ ఆత్మహత్య చేసుకోవడం వెనుక గల కారణాలు, పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. స్వీటీ శర్మ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అజయ్ కుమార్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.
Also Read: Couple Suicide : గుంటూరులో విషాదం...పెళ్లికి ఒప్పుకోలేదని..ప్రేమజంట సూసైడ్