శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో.. కలకలం సృష్టిస్తున్న బాంబు బెదిరింపులు హైదరాబాద్‌లోని శంషాబాద్ రాజివ్ గాంధీ ఎయిర్‌పోర్ట్‌లో బాంబు బెదిరింపలు కలకలం సృష్టించాయి. హైదరాబాద్ నుంచి బ్యాంకాకు వెళ్లే విమానం గేట్ దగ్గర ఓ ప్రయాణికుడు బాంబు ఉందని అరవడంతో అతన్ని అదుపులోకి తీసుకుని, అధికారులు అలర్ట్ అయ్యారు. By Kusuma 16 Nov 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి విమాన బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి బాంబు బెదిరింపులు వచ్చాయి. హైదరాబాద్ నుంచి బ్యాంకాకు వెళ్లే విమానం గేట్ దగ్గర ఓ ప్రయాణికుడు బాంబు ఉందని గట్టిగా అరిచాడు. దీంతో వెంటనే అధికారులు అలర్ట్ అయ్యారు. ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతని లగేజీని పరిశీలిస్తున్నారు. ఇది కూడా చూడండి: అయ్యప్ప దర్శనాలకు పోటెత్తిన భక్తులు..తొలిరోజే ఎంతమందంటే? 136 మంది ప్రయాణికులతో.. హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ వెళ్తున్న ఈ విమానంలో మొత్తం 136 మంది ప్రయాణికులు ఉన్నారు. వెంటనే అందరూ ఆందోళన చెందారు. బాంబు బెదిరింపులతో అలర్ట్ అయిన అధికారులు వెంటనే విమానంలో తనిఖీలు నిర్వహించారు. ఈ మధ్య కాలంలో ఈ బాంబు బెదిరింపులు ఎక్కువయ్యాయి. గత కొన్ని రోజుల నుంచి వందలాది ఫ్లైట్‌లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇది కూడా చూడండి: మెడికల్ కాలేజ్‌లో అగ్ని ప్రమాదం..10 మంది చిన్నారులు సజీవదహనం ఈ బెదిరింపుల కారణంగా ఫ్లైట్ ఏజెన్సీలు విపరీతమైన నష్టాన్ని చవిచూస్తున్నాయి. దానికి తోడు విమానాలు ఆలస్యం అవడం, కొన్ని క్యాన్సిల్ కూడా అవుతున్నాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఇలా బెదిరింపులకు పాల్పడే వారిని ‘‘నో ఫ్లై’’ లిస్టులో చేర్చాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. రూల్స్ ఉల్లంఘిస్తే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇది కూడా చూడండి: రీల్స్ చేస్తే జైలుకే..రైల్వే బోర్డు సీరియస్ డెసిషన్ కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు ధిక్కరిస్తే థర్డ్ పార్టీ కంటెంట్‌ను ఆయా ప్లాట్‌ఫామ్‌లు తీసుకునే వెసులుబాటు నిలిపివేస్తామని స్పష్టం చేసింది. ఇటీవల వివిధ ఎయిర్‌లైన్స్‌కు బాంబు బెదిరింపు ఫోన్‌కాల్స్ రావడం వల్ల పలు విమాన సర్వీసులు కూడా ఆలస్యమయ్యాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. వీటిని దృష్టిలో ఉంచుకొని వీలైనంత త్వరగా తప్పుడు వార్తలు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేసింది. ఇది కూడా చూడండి: చివరి మ్యాచ్‌లో గెలుపు..3–1తో సీరీస్ కైవసం #rajiv-gandhi-international-airport #shamshabad #Bomb Threat News మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి