UP: మెడికల్ కాలేజ్‌లో అగ్ని ప్రమాదం..10 మంది చిన్నారులు సజీవదహనం ఉత్తర ప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటు చేసకుంది. ఝాన్సీ లోని ఓ మెడికల్ మెడికల్ కాలేజీలో ఉన్న నియోనాటల్ ఇంటెన్సీవ్ కేర్ యూనిట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. దీంట్లో పది మంది చిన్నారులు సజీవ దహనం అయ్యారు. By Manogna alamuru 16 Nov 2024 in నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Fire Accident In Medical College: ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో జరిగిన సంఘటన అక్కడి తల్లులకు తీవ్ర కడుపు కోతను మిగిల్చింది. ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయ్ మెడికల్ కళాశాలలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో మంటలు చెలరేగడంతో.. పది మంది శిశువులు సజీవదహనమయ్యారు. మంటల వ్యాప్తితో రోగులు, ఆసుపత్రి సిబ్బంది ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. తమ ప్రాణాలను రక్షించుకోవడానికి బయటకు పరుగులు పెట్టారు. ఈ క్రమంలో స్వల్ప తొక్కిసలాట సైతం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్...ఇక్కడ అప్పుడే పుట్టిన శిశువులకు చికిత్సను అందిస్తారు. పుట్టిన వెంటనే ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిన్నారులు ఇందులో కొన్ని రోజులు ఉంచి ఆ తరువాత తల్లిదండ్రుల దగ్గరకు చేరుస్తారు. మహారాణి లక్ష్మీబాయ్ మెడికల్ కళాశాలలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో మొత్తం 47 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. మంటలు అంటుకున్న వెంటనే తల్లిదండ్రులు తమ చిన్నారులను తీసుకొని బయటకు పరుగెత్తారు. అయినా కూడా పది మంది శిశువులు మాత్రం మంటలకు బలయ్యారు. మరోవైపు ఆసుపత్రిలో ఉన్న గర్భిణులను వారి బంధువులు క్షేమంగా బయటకు తరలించారు. మంటల వ్యాప్తితో ఒక్కసారిగా ఆ ప్రాంగణంలో దట్టమైన పొగ వ్యాపించింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. Also Read: Cricket: మళ్ళీ తండ్రయిన రోహిత్ శర్మ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చేలరేగి ఉంటాయని జిల్లా కలెక్టర్ అవినాశ్ కుమార్ అన్నారు. ప్ర్తుతం చిల్లా యంత్రాంగం అంతా ఆసుపత్రి దగ్గరే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనపై ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. గాయపడ్డ చిన్నారులకు అత్యుత్తమ చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటన ఎలా జరిగిందో వెంటనే దర్యాప్తు చేపట్టాలన్నారు. Also Read: Cricket: చివరి మ్యాచ్‌లో గెలుపు..3–1తో సీరీస్ కైవసం మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి