Railways: రీల్స్ చేస్తే జైలుకే..రైల్వే బోర్డు సీరియస్ డెసిషన్ ఏం రీల్స్ పిచ్చో ఏమో కానీ ఈ మధ్య వీటితో ఎంటర్టైన్మెంట్ కన్నా ప్రమాదాలే ఎక్కువ జరుగుతున్నాయి. ఈ రీల్స్ మోజు మరీ ఎక్కువ అయిపోతుండడంతో రైల్వే బోర్టు వీటిని కట్టడి చేసేందుకు చర్యలకు సిద్ధమైంది. రైల్లో రీల్స్ చేస్తే ఇక మీదట జైలుకే అని హెచ్చరించింది. By Manogna alamuru 15 Nov 2024 in నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి No Reels In Trains: సోషల్ మీడియా, రీల్స్...వీటి మోజులో పడి చాలా మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా రైల్వే స్టేషన్లలో, రైలు ప్రయాణాల్లో చాలా మంది ప్రమాదాల బారిన పడుతున్నారు. అందుకే రైల్వే బోర్డు స్ట్రిక్ట్ డెసిషన్ తీసుకుంది. ఇక మీదట రైళ్ళ దగ్గర రీల్స్ చేస్తే కేసులు పెట్టమని చెప్పింది. ఇకపై రైల్వే ప్రాంగణాల్లో గానీ.. రైల్లో గానీ రీల్స్ చేసే వారిపై చర్యలు తీసుకోవాలంటూ అన్ని జోన్లకు రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేసింది. రైల్వే ట్రాక్‌లు, కదులుతున్న రైళ్లలో ప్రమాదకర స్టంట్‌లు చేస్తూ వీడియోలు చిత్రీకరిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రైలు కార్యకలాపాలకు ముప్పు కలిగిస్తే లేదా ప్రయాణికులకు అసౌకర్యం కలిగిస్తే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సూచించింది. ప్రజలు, ప్రధానంగా యువకులు, రైల్వే ట్రాక్‌లపై ,కదులుతున్న రైళ్లలో స్టంట్‌లు చేస్తున్నారు. రైలు సిబ్బంది, రైల్వే బోర్డు కూడా ఇన్నాళ్ళష్ట్ర చూసీ ఊడనట్టు ఊరుకుంది. కానీ ఇప్పుడు పరిస్థితులు శృతి మించాయి. అందుకే చర్యలకు ఉపక్రమిస్తున్నాం అని ప్రకటించింది రైల్వే బోర్డు. రీల్స్ చేసే వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేయాలని రైల్వే బోర్డు అన్ని జోన్‌లను ఆదేశించినట్లు జాతీయ మీడియా తెలిపింది. రీల్స్ చేసే వారు అన్ని పరిమితులను దాటారు. వారు తమ ప్రాణాలను పణంగా పెట్టడమే కాకుండా, ట్రాక్‌లపై వస్తువులను ఉంచడం, ట్రాక్‌లపై వాహనాలను నడపడం లేదా కదులుతున్న రైళ్లలో ప్రాణాంతక విన్యాసాలు చేయడం ద్వారా వందలాది మంది రైలు ప్రయాణీకుల భద్రతను కూడా ప్రమాదంలో పడేస్తారు..అని రైల్వే బోర్డు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. Also Read: IPL-2025: ఐపీఎల్ 2025 మెగా వేలం షార్ట్ లిస్ట్ ఇదే.. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి