/rtv/media/media_files/2025/11/17/saudi-arabia-2025-11-17-13-37-11.jpg)
Saudi Arabia
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటనలో 45 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే వీరిలో హైదరాబాద్‌కు చెందిన రెండు కుటుంబాలు కూడా ఉన్నాయి. ఈ ప్రమాద ఘటనలో చనిపోయిన వారిలో ఒక కుటుంబానికి చెందిన 7 గురు, మరో కుటుంబానికి చెందిన 8 గురు ఉన్నారు. ఈ రెండు కుటుంబాల నుంచి షోయబ్ అనే యువకుడు మాత్రమే బయటపడ్డాడు. ప్రస్తుతం ఇతను ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నాడు.
ఇది కూడా చూడండి: Gen Z protest : మెక్సికోలో హింసాత్మకంగా మారిన జెన్ జెడ్ నిరసన....100 మందికి పైగా..
🚨 BIG BREAKING 🚨
— ياسر (@yasirposts) November 17, 2025
In a brutal accident in Saudi Arabia, 42 Indians from Hyderabad, who had gone there for Umrah have lost their lives.
May Allah grant them Jannat al-Firdous. Inna lillahi wa inna ilaihi raje'uoon. pic.twitter.com/MRhfvTjDGa
హైదరాబాద్ వాసులు..
ఈ ప్రమాదంలో మహమ్మద్ అబ్దుల్ కధీర్ (షోయబ్ తండ్రి, గౌసియా బేగం (షోయబ్ తల్లి) తోపాటు బంధువులు మహమ్మద్ మౌలానా (గౌసియా తండ్రి, షోయబ్ తాత), రహీమ్ ఉనిషా, రెహమత్ బి, మహమ్మద్ మన్సూర్ చనిపోయారు. ముఫ్టీ ఆసిఫ్ ఉల్లా కుటుంబానికి చెందిన వారిలో మహమ్మద్ అలీ, సేహనాధ్ బేగం, మస్తాన్, జకీయ బేగం, మహమ్మద్ సోయాబ్, పర్వీన్ బేగం, మొహమ్మద్ సోహెల్ మృతి చెందారు. వీరంతా బోరబొండ ప్రాంతానికి చెందినట్లు గుర్తించారు.
ఇదిలా ఉండగా.. సౌదీలో మక్కా నుంచి మదీనాకు వెళ్తుండగా.. బదర్-మదీనా ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. డీజిల్ ట్యాంకర్‌ను బస్సు ఢీకొట్టడంతో స్పాట్‌లోనే 45 మంది మృతి చెందారు. 18 మంది వీరిలో హైదరాబాద్ వాసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఇది కూడా చూడండి: BIG BREAKING: సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 42 మంది మృతి.. హైదరాబాద్ వాసులే ఎక్కువ!
Follow Us