Ravi Prakash: ఇంకా ఎంత మంది చావాలి ?: కర్నూల్ బస్సు ప్రమాదంపై రవి ప్రకాష్ ప్రశ్నలు!

కర్నూల్‌లో జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై రవిప్రకాశ్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. ప్రజా రవాణాను ప్రైవేటు రంగానికి అప్పంగించిన ప్రభుత్వ వ్యవస్థలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

New Update
Ravi Prakash responds on Kurnool bus fire accident

Ravi Prakash responds on Kurnool bus fire accident

కర్నూల్‌లో జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 20 మంది సజీవ దహనమయ్యారు. ఈ ఘటనపై రవిప్రకాశ్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. ప్రజా రవాణాను ప్రైవేటు రంగానికి అప్పంగించిన ప్రభుత్వ వ్యవస్థలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. '' బస్సులో జరిగిన అగ్ని ప్రమాదం ఇదే మొదటిసారి కాదు. ఇదే చివరిది కూడా కాదు. టీవీ 9లో ఉన్నప్పటి రోజుల నుంచి ఇప్పటివరకు నా పోరాటం ఎల్లప్పటికీ ప్రజలు, కార్మికులు, ప్రయాణికులు, ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న మర్చిపోయిన వాళ్ల కోసమే. 

Also Read: అయ్యో అనూష.. బస్సు ప్రమాదంలో యాదాద్రి యువతి.. కన్నీటి కథ!

ప్రస్తుతం మనం చూస్తున్నది కేవలం ప్రమాదం మాత్రమే కాదు. ప్రైవేటైజేషన్ దారితప్పడం, ఆర్టీసీని చంపి ప్రజా రవాణాను ప్రైవేటు తిమింగలాలకు అమ్మేసిన వ్యవస్థల దహన ఫలితమే. ఇంకా ఎన్ని బస్సులు ఇలా కాలిపోవాలి? ఇంకా ఎంతమంది ప్రాణాలు బలికావాలి?. తెలంగాణ , ఏపీలోని రోడ్లు అవినీతి, రక్తం, మౌనంతో నిర్మించబడ్డాయని ఎవరైనా అంగీకరించడానికి ఇంకెన్ని కుంటుంబాలు తమ వారిని కోల్పోవాలి?. ప్రజల కోసం నిజంగా ఎవరున్నారు? చట్టవిరుద్ధమైన వాహనాలతో లాభాలు పొందుతూ రాజకీయ నాయకుల జేబులు నింపేవారా, లేక నిజం చెప్పేందుకు ధైర్యం చేసే వాళ్లా?.  ఈ జ్వాలలు కేవలం నిప్పు కణాలు మాత్రమే కాదు. కూలిపోతున్న వ్యవస్థకు చితి మంటలని'' రవిప్రకాశ్ రాసుకొచ్చారు. 

Also Read: కర్నూలు ప్రమాదంపై మోదీ దిగ్భ్రాంతి...  ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన పీఎం

Advertisment
తాజా కథనాలు