/rtv/media/media_files/2026/02/18/sunitha-murder-2026-02-18-16-44-15.jpg)
హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సునీత హత్య కేసు(Sunitha Murder Case) లో పోలీసులు విస్తుపోయే నిజాలు బయటపెట్టారు. గ్రీన్‌సిటీ కాలనీలో జరిగిన ఈ దారుణానికి ఆమె మొదటి భర్త మహేశ్ ప్రధాన సూత్రధారి అని దర్యాప్తులో తేలింది. రెండో పెళ్లి చేసుకుందని కక్షతో పక్కా ప్లాన్ ప్రకారం మర్డర్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అమెరికా(america) నుంచి వచ్చి మరీ ఆమెను హత్య చేసిన తీరు స్థానికులను భయాందోళనకు గురిచేసింది.
నిందితుడు మహేశ్, మృతురాలు సునీత ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు(software engineer murder). గతంలోనే వీరిద్దరికీ వివాహం జరిగింది. ఉద్యోగ రీత్యా అమెరికాలో స్థిరపడిన ఈ జంట మధ్య కొన్నాళ్ల తర్వాత మనస్పర్థలు మొదలయ్యాయి. తరచూ గొడవలు జరగడంతో విసిగిపోయిన సునీత, మహేశ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే అమెరికా వదిలి భారత్‌కు తిరిగి వచ్చేసింది. ఇండియా వచ్చిన తర్వాత సునీత చట్టబద్ధంగా మహేశ్‌కు విడాకులు ఇచ్చింది. అనంతరం తన జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలనే ఉద్దేశంతో రెండో వివాహం చేసుకుంది. అయితే, తనను వదిలేసి వేరొకరిని పెళ్లి చేసుకోవడాన్ని మహేశ్ జీర్ణించుకోలేకపోయాడు. ఆమె తనను మోసం చేసిందని భావించి, ఎలాగైనా పగ తీర్చుకోవాలని అమెరికాలోనే పథకం రచించాడు.
Also Read : బాల్క సుమన్ అరెస్టు.. క్యాతన్‌పల్లిలో తీవ్ర ఉద్రిక్తత
సినిమా ఫక్కీలో హత్యాయత్నం
సునీతను చంపడానికి మహేశ్(Husband Kill Wife) అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్నాడు. వెంట కత్తులు, పెట్రోల్ బాటిల్‌తో వనస్థలిపురంలోని సునీత నివాసానికి వెళ్లాడు. ఆ సమయంలో అడ్డువచ్చిన ఆమె బంధువులను "ఎవరైనా అడ్డు వస్తే చంపేస్తాను" అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇంట్లోకి చొరబడిన మహేశ్, చివరకు పూలకుండీతో సునీత తలపై బలంగా కొట్టి అతి దారుణంగా హత్య చేశాడు.
Also Read : తెలంగాణలో మరో ఎన్నికల నోటిఫికేషన్.. ఎప్పుడంటే?
పోలీసుల అదుపులో నిందితుడు
ఘటన జరిగిన వెంటనే సమాచారం అందుకున్న వనస్థలిపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు మహేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించిన పోలీసులు, ఇది ముమ్మాటికీ ప్రతీకారంతో చేసిన హత్యేనని ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం మహేశ్‌ను విచారిస్తున్నారు.
Follow Us