Teacher Harassment News: వీడు టీచర్ కాదు టార్చర్.. తన్నిన సిగ్గు రాలే: మరో విద్యార్థినిని ఏం చేశాడంటే!

రంగారెడ్డి జిల్లాలో మరో కీచక టీచర్ వ్యవహారం బయటపడింది. ఇబ్రహీంపట్నం లయోల స్కూల్ లోని ప్రిన్సిపల్ దీనావన్‌ రావు పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ప్రిన్సిపల్‌ పై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు.

author-image
By Krishna
New Update
teacher loyala

Teacher Harassment

Teacher Harassment News: చదువులు చెప్పే టీచర్లు కామకోరికలతో నీతిమానుల పనులు చేస్తున్నారు. విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లాలో మరో కీచక టీచర్ వ్యవహారం బయటపడింది. పాఠశాలలో చదివే విద్యార్థినిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఇబ్రహీంపట్నం లయోల స్కూల్ లోని ప్రిన్సిపల్ దీనావన్‌ రావు టెన్త్ విద్యార్థినిపై అత్యాచార యత్నం చేశాడు. విద్యార్థిని జరిగిన విషయాన్ని ఇంట్లో చెప్పడంతో దినావర్‌ రావుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆమె పేరెంట్స్.  ప్రిన్సిపల్‌ దీనావన్‌ రావుపై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు.  దినావర్‌ రావుపై గతంలోనూ లైంగికదాడి ఆరోపణలున్నాయి.  విద్యార్థినులను లోబర్చుకొని అత్యాచారం చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఓ సారి ఇలాగే చేస్తే విద్యార్థిని తల్లిదండ్రులు ఇతనికి దేహశుద్ది చేశారు. ఇలాంటి ప్రిన్సిపల్‌ను అసలు వదలకూడదని అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల ఆందోళన చేపట్టాయి.  

Also Read: Mastan Sai : డ్రగ్స్ ఇస్తాడు.. న్యూడ్ వీడియోలు తీస్తాడు..  మస్తాన్ మాములోడు కాదయ్యా!

Also Read: Sekhar Basha: శేఖర్ బాషాకు బిగ్ షాక్.. మరో కేసు నమోదు..

విద్యార్థినిపై ముగ్గురు ఉపాధ్యాయులు అత్యాచారం 

ఇటీవల తమిళనాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. చదువు చెప్పాల్సిన గురువులే విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఒకరు కాదు ఇద్దరూ కాదు.. ఏకంగా ముగ్గురు ఉపాధ్యాయులు కలిసి ఓ విద్యార్థినికి సామూహిక అత్యాచారం చేశారు.  తమిళనాడులోని కృష్ణగిరి సమీపంలో ఓ ప్రభుత్వ పాఠశాల ఉంది. ఓ 13 ఏళ్ల విద్యార్థిని 8వ తరగతి చదువుతోంది. అయితే గత నెల రోజుల నుంచి ఆ బాలిక స్కూల్‌కి వెళ్లడంలేదు. దీంతో స్కూల్ ప్రిన్సిపల్, మిగతా విద్యార్థినులు ఆమెను అడగ్గా స్పందించలేదు.

Also Read: గిరిజన యువతులు నల్లగా, అంద వికారంగా.. ఒడిశా సీఎం చీప్ కామెంట్స్!

స్కూల్ ప్రిన్సిపల్ కారణం ఏంటని ఆ బాలిక ఇంటికి వెళ్లి తల్లిని అడిగారు. దీంతో ఆమె తన కూతురికి జరిగిన అన్యాయాన్ని వివరించింది. తన కుమార్తె గర్భం దాల్చిందని, అబార్షన్‌ చేయించడానికి ఆస్పత్రికి తీసుకెళ్తున్నట్లు చెప్పారు. పాఠశాలలో పని చేస్తున్న ముగ్గురు ఉపాధ్యాయులు బాలికపై సామూహిక అత్యాచారం చేసినట్లు తెలిపారు. దీంతో ప్రిన్సిపల్ షాక్ అయ్యారు. వెంటనే స్కూల్ ప్రిన్సిపల్ సాయంతో ఆ బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఉపాధ్యాయులైన చిన్నసామి(57), ఆరుముగం(45), ప్రకాశ్‌(37)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Also Read :  కానిస్టేబుల్‌ కాదు కామాంధుడు.. కేసు పెట్టడానికి వస్తే గర్భవతిని చేసి

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు