/rtv/media/media_files/2025/04/21/toHjiHEfg1j8uREnLOLg.jpg)
Online Betting Scam Anantapur boy Jayachandra sucide
Betting: ఆన్‌లైన్ బెట్టింగ్ మోసానికి మరో యువకుడు బలయ్యాడు. ఏపీ హిందూపురంలో 6 లక్షల అప్పు చేసిన జయచంద్ర రైలు కిందపడి చనిపోయాడు. చనిపోయే ముందు ‘ప్లీజ్ డోంట్ ప్లే ఆన్‌లైన్ గేమ్స్’ అంటూ ఓ చీటీ రాసి తన జేబులో పెట్టుకున్నాట్లు పోలీసులు తెలిపారు.
రూ.6 లక్షలు అప్పు చేసి బెట్టింగ్..
ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం పరిగి మండలం పైడేటి గ్రామానికి చెందిన ఆదినారాయణ, వెంకటలక్ష్మమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు. పెద్దకొడుకు ఇంటిదగ్గరే వ్యవసాయం చేస్తుండగా చిన్నకొడుకు జయచంద్ర(23) డిగ్రీ వరకు చదువుకున్నాడు. పాలసేకరణ కేంద్రం నడిపిస్తూ ఈ కుటుంబం జీవనం సాగిస్తోంది. అయితే కొంతకాలంగా
ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్‌కు అలవాటుపడ్డ జయచంద్ర.. రూ.6 లక్షలు అప్పు చేసి బెట్టింగ్ కాసి నష్టపోయాడు. దీంతో అప్పులు తీర్చేందకు బెంగళూరు వెళ్లి జాబ్ చూసుకున్నాడు.
Also Read: Telangana: తెలంగాణలో ద్రోణి ప్రభావం... మరో 2 రోజులు వానలు.. పిడుగులు!
అయితే అక్కడపని సరిగా లేకపోవడంతో తిరికి ఇంటికి వచ్చాడు. ఆదివారం తెల్లవారుజామున హిందూపురం సమీపంలోని రైలు కిందపడి చనిపోయాడు. ఆత్మహత్యకు ముందు ‘ప్లీజ్ డోంట్ ప్లే ఆన్‌లైన్ గేమ్స్’ అంటూ ఓ చీటీ రాసి జేబులో పెట్టుకున్నాడు.తన షర్డుపై కూడా అలాగే రాసుకున్నాడు. అప్పు కడతామని చెప్పినప్పటికీ కొడుకు చనిపోవడంతో పేరెంట్స్, బంధువులు గుండెలు పగిలేలా రోధించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్సై సజ్జప్ప తెలిపారు.
Also Read: Zelensky: చెప్పుకోవడానికే కాల్పుల విరమణ..దాడులు మాత్రం ఆగడం లేదు!
sucide | young-boys | telugu-news | today telugu news