Crime: అడ్డంగా దొరికిపోయిన భార్య, ప్రియుడు.. భర్త మర్డర్ కి స్కెచ్చేస్తే షాకింగ్ ట్విస్ట్!

వరంగల్ జిల్లాలో మరో భర్త వివాహేతర సంబంధానికి బలయ్యాడు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసేందుకు ప్రయత్నించింది భార్య. కానీ, ఆ భర్త అదృష్టం బాగుండడంతో ప్రాణాలతో బయటపడ్డాడు!

New Update
Warangal crime

Warangal crime

Crime: ఇటీవల కాలంలో వివాహేతర బంధాల వల్ల కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్న ఘటనలు సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రియుడు, ప్రియురాలి మోజులో పడి కట్టుకున్న వారిని, కన్నపిల్లలనే సైతం హతమార్చడానికి తెగిస్తున్నారు కొంతమంది మూర్ఖులు!  మీర్ పెట్ కుక్కర్ ఇన్సిడెంట్ మొదలు కొని మేఘాలయ హనీమూన్ మర్డర్, గద్వాల్ మేయర్ తేజశ్వర్ హత్య వరకు ఎంతో మంది వివాహేతర సంబంధాలకు బలయ్యారు. డబ్బు, సుఖాల కోసం మానవ సంబంధాలకు విలువ లేకుండా పోతున్న నేటి సమాజానికి ఈ సంఘటనలు అద్దం పడుతున్నాయి. ఒక సంఘటన మరవకముందే , మరో ఘటన వెలుగులోకి వస్తోంది. తాజాగా వరంగల్ జిల్లాలో మరో భర్త వివాహేతర సంబంధానికి బలయ్యాడు. 

భర్త హత్యకు స్కెచ్ 

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసేందుకు ప్రయత్నించింది భార్య. కానీ, ఆ భర్త అదృష్టం బాగుండడంతో ప్రాణాలతో బయటపడ్డాడు! విషయం తెలుసుకున్న పోలీసులు భార్యను, ఆమె ప్రియుడిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే వరంగల్ జిల్లా రామన్న పేటకు చెందిన గంగరబోయిన రాజు, పద్మకు  కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే భార్య పద్మ కొంతకాలంగా జమ్మి కుంట గ్రామానికి చెందిన సందీప్ తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.

ఈ క్రమంలో భర్త తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన పద్మ.. ప్రియుడితో కలిసి అతడిని చంపేందుకు స్కెచ్ వేసింది. కట్టుకున్న భర్త అనే కనీస మమకారం లేకుండా హత్య చేయాలని నిర్ణయించుకుంది.  ఈనెల 14న భర్త రాజు హత్యకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇందులో భాగంగా రాజుకు ఫుల్లుగా మద్యం తాగించి.. ప్రియుడు  సందీప్ తో పాటు మరో ముగ్గురు కలిసి అతడిపై దాడి చేశారు. మద్యం మత్తులో ఉన్న రాజును బాగా కొట్టి చంపాలని ప్లాన్ చేశారు. కానీ, ఇక్కడే కథ అడ్డం తిరిగింది.

స్థానికులు ద్వారా రాజుపై దాడి జరుగుతుందని తెలుసుకున్న అతడి తల్లి విజయ వెంటనే ఘటన స్థలానికి చేరుకుంది. దీంతో సందీప్, అతడి స్నేహితులు అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. భార్య పద్మ, ప్రియుడు సందీప్ ని అరెస్ట్ చేశారు. అలాగే వారి నుంచి రూ.5.40 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు నిందితులను త్వరలో పట్టుకుంటామని ఇన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ తెలిపారు. 

రాజస్థాన్ లో మరో దారుణం.. 

ఇదిలా ఉంటే.. రాజస్తాన్ లో మరో దారుణం చోటుచేసుకుంది. ప్రియురాలు కోరిందని కట్టుకున్న భార్యను చంపేశాడు ఓ బీజీపే లీడర్. అజ్మీర్ లోని కిషన్గడ్ కి చెందిన బీజేపీ నాయకుడు రోహిత్ సైనికి సంజు సైని అనే మహిళతో కొంత కాలమే క్రితమే పెళ్లయింది. అయితే పెళ్ళైనప్పటికీ రోహిత్.. రీతూ అనే మరో యువతో వివాహేతార సంబంధం పెట్టుకున్నాడు. గత రెండేళ్లుగా వీళ్ల మధ్య ఈ సంబంధం కొనసాగుతుంది. ఈ క్రమంలో రోహిత్ కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలిసిపోయింది. దీంతో ఇంట్లో తరచూ గోడవలు జరగడం మొదలయ్యాయి. అయినప్పటికీ రోహిత్, రీతూ రహస్యంగా కలుసుకుంటూనే ఉన్నారు. ఈ క్రమంలో ప్రియురాలు రీతూ దారుణనానికి ఒదిగట్టింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని రోహిత్ భార్య సంజుని చంపడానికి స్కెచ్ వేసింది. ఎలాగైనా సరే భార్యను చంపాలని రోహిత్ ని ఒత్తిడి చేసింది. దీంతో ప్రియురాలి కోరిక మేరకు భార్యను చంపాడు . 

Advertisment
తాజా కథనాలు