Nellore Crime: పరాయి వ్యక్తి భార్య పై కన్నేసిన ఓ కామాంధుడు కోరిక తీర్చలేదని మహిళను దారుణంగా హత్యాచారానికి పాల్పడ్డాడు. మహిళ ఒప్పుకోకపోవడంతో రాడ్డుతో కొట్టి.. ఎంతో కిరాతకంగా ఆమెపై అత్యాచారం చేశాడు. నెల్లూరు జిల్లా కావలిలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. Also Read: Armaan Malik: సోషల్ మీడియా ఇన్‌ప్లుయోన్సర్ తో సింగర్ అర్మాన్ మాలిక్ పెళ్లి.. ఫొటోలు వైరల్ కోరిక తీర్చలేదని.. కోల్‌కతాకు చెందిన శ్రీకాంత్, అతని భార్య అనిషిత నెల్లూరులోని గాయత్రి నగర్ లే ఔట్‌లో నివాసం ఉంటున్నారు. శ్రీకాంత్ 15 ఏళ్లుగా అక్కడే నాటు వైద్యం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే డిసెంబర్ 31న శ్రీకాంత్ భార్య అనిషిత దారుణంగా హత్య చేయబడింది. కావలి సమీపంలోని ఓ కాలువలో ఆమె మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా అసలు నిజాలు బయటపడ్డాయి. Also Read: RGV: వివాదాలకు పోను, అమ్మాయిల జోలికి అస్సలే పోను.. RGV న్యూ ఇయర్ ట్వీట్ ! అయితే శ్రీకాంత్, అతని భార్య అనిషిత నివాసం ఉంటున్న అదే ఏరియాలో ఉంటున్న నయన్ బిశ్వాన్ అనే వ్యక్తి కొన్నాళ్లుగా శ్రీకాంత్ భార్య అనిషిత పై కన్నేశాడు. కాగా, డిసెంబర్ 31న శ్రీకాంత్ లేని సమయంలో నయన్ అనిషితపై అత్యాచార యత్నం చేశాడు. తన కోరిక తీర్చాలని అనిషితను బలవంతం పెట్టాడు. అయినప్పటికీ ఒప్పుకోకపోవడంతో ఆమెను రాడ్డుతో కొట్టి.. పొదల్లోకి తీసుకెళ్లి అత్యంత కిరాతకంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం చంపేసి మృతదేహాన్ని కాలువలో పడేసి వెళ్ళిపోయాడు. విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు నయన్ బిశ్వాన్‌ను అరెస్ట్ చేశారు. కర్ణాటకలో మరో దారుణం ఇది ఇలా ఉంటే ఇటీవలే కర్ణాటకలోని బెళగవి జిల్లాలో దారుణం జరిగింది. కన్నతండ్రే కూతురి పై కన్నేశాడు. కన్న ప్రేమను మర్చిపోయి కూతురి పై అత్యాచారానికి తెగబడ్డాడు. దీంతో భార్య అతడిపై తల్లి తన కోపంతో రగిలిపోయింది. భర్తను ముక్కలు , ముక్కలుగా నరికి మృతదేహాన్ని ఊరు చివర్లో పడేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. Also Read: Gandhi TathaChettu: థియేటర్స్ లో సుకుమార్ కూతురు అవార్డు విన్నింగ్ షార్ట్ ఫిల్మ్..!