/rtv/media/media_files/2024/12/12/oYSoaEMZEnTqWppOwBBW.webp)
Mancherial crime
Mancherial Crime: కన్న ప్రేమను మర్చిపోయి తండ్రిని అతి కిరాతకంగా హత్య చేశాడు కొడుకు. తండ్రిపై కోపంతో స్నేహితులతో కలిసి మారణాయుధాలతో నరికి చంపాడు. ఈ దారుణ ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున వెలుగు చూసింది.
Also Read: Kurchi Madathapetti: 'కుర్చీ మడతపెట్టి' పాటకు యమ క్రేజ్.. నేపాల్ వీధుల్లో దుమ్మురేపిన అమ్మాయిలు! వీడియో వైరల్
తండ్రి అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడని..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జైపూర్ మండలం ఇందారం గ్రామంలో రాజయ్య(45) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతను ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే రాజయ్య రోజూ మద్యం తాగుతూ.. ఇంటికొచ్చి భార్యను కొట్టేవాడట. అంతేకాకుండా బయట అక్రమ సంబంధాలు కూడా పెట్టుకున్నట్లు అతడి కొడుకు సాయికి కొంతకాలంగా అనుమానం ఉంది. దీంతో ఇవ్వన్నీ తట్టుకోలేపోయిన సాయి శుక్రవారం అర్థరాత్రి తండ్రిని దారుణంగా హత్య చేశాడు. అతడి స్నేహితులు సందీప్, వినయ్ కలిసి తండ్రి రాజయ్యను మారణాయుధాలతో దాడి చేసి చంపినట్లు పోలీసులు తెలిపారు. సందీప్ శ్రీరాంపూర్ కి చెందిన యువకుడు కాగా.. వినయ్ అదే గ్రామానికి చెందినవాడు. ఉదయాన్నే స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : Jammu Kashmir: జమ్మూ కశ్మీర్ లో ఆగని మిస్టరీ మరణాలు..200 మంది క్వారంటైన్ కేంద్రాలకు!
వరంగల్ మరో హత్య
ఇది ఇలా ఉంటే ఇటీవలే వరంగల్ హైవే జంక్షన్ వద్ద నడిరోడ్డుపై ఆటోడ్రైవర్ ను దారుణంగా పొడిచి చంపారు. ఆటో డ్రైవర్ రాజ్‌కుమార్‌ను ప్రత్యర్ధి ఆటో డ్రైవర్ వెంకటేశ్వర్లు దారుణంగా పొడిచి హత్య చేశాడు. ఒకటికాదు రెండు కాదు ఏకంగా 15 సార్లు కత్తితో పొడిచాడు. దీంతో రాజ్‌కుమార్ కిందపడిపోయినప్పటికీ వదలకుండా పొడుస్తూనే ఉన్నారు. చివరకు గొంతులో కూడా కత్తితో పొడవడంతో ఆటోడ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
Also Read: Allu Aravind: వావ్! అమ్మాయితో కలిసి ఆలు అల్లు అరవింద్ భలే డాన్స్ వేశారు! వీడియో చూశారా
Follow Us