/rtv/media/media_files/2025/09/23/graveyard-2025-09-23-07-04-20.jpg)
మధ్యప్రదేశ్(madhya pradesh) లోని ఖర్‌గోన్ జిల్లాలో జరిగిన ఓ వింత సంఘటన స్థానికులను, పోలీసులను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇస్లాంపూర్ గ్రామంలోని ముస్లీ కమ్యూనిటీ స్మశానవాటికలో గుర్తు తెలియని వ్యక్తులు సమాధులను ధ్వంసం చేశారు. ఈ ఘటన మతపరమైన ఉద్రిక్తతలకు దారితీసింది. అయితే, దర్యాప్తులో పోలీసులకు సీసీటీవీ ఫుటేజ్ లభించింది.
Also Read : ఆశ్రయం ఇచ్చి ఇరుక్కుకున్నాడు..పరువుపోతుందనుకుంటే ప్రాణం పోయింది
Naked People Dig Graves In Graveyards
ఈ వీడియోలో నగ్నంగా(Naked People) ఉన్న ఇద్దరు వ్యక్తులు ఇద్దరు వ్యక్తులు సమాధులను(graveyard) తవ్వడం, వాటిని ధ్వంసం చేయడం స్పష్టంగా కనిపించింది. వారి నగ్నత్వం, విచిత్రమైన ప్రవర్తన చూస్తే, వారు వేరే మతస్థులు కాదని పోలీసులు భావిస్తున్నారు. మానసిక సమస్యలతో బాధపడుతున్నారని లేదా ఏదో మత్తు పదార్థాల ప్రభావంలో ఉన్నారని పోలీసులు అనుకుంటున్నారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సమాధుల ధ్వంసం వెనుక ఉన్న వ్యక్తులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం, ఈ కేసులో మతపరమైన కోణం కంటే, మానసిక స్థితి లేదా మత్తు పదార్థాల ప్రభావం వంటి అంశాలపై దృష్టి సారించారు. ఈ సంఘటన స్థానికులలో ఆందోళన కలిగించింది. ఇస్లాంపూర్ గ్రామస్తులు తమ స్మశానవాటికకు భద్రత పెంచాలని కోరుతున్నారు. ఈ విషయంపై పోలీసులు మరింత సమాచారాన్ని వెల్లడించేందుకు సిద్ధంగా లేరు. అయితే, నిందితులను త్వరలో పట్టుకుంటామని హామీ ఇచ్చారు.
Also Read : జుబీన్ గార్గ్ మృతదేహానికి మరోసారి పోస్టుమార్టం