/rtv/media/media_files/2025/06/10/n52v280QVQRt98iIbewX.jpg)
Meghalaya Honeymoon Murder Case
మేఘాలయ హనీమూన్ హత్య కేసులో పోలీసులు 970 పేజీల ఛార్జిషీట్‌ను కోర్టులో దాఖలు చేశారు. భార్య, ఆమె ప్రియుడే ఈ హత్యకు ప్రధాన కారకులని ఈ ఛార్జిషీట్ స్పష్టం చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా రాజా రఘువంశీ భార్య సోనమ్ రఘువంశీ, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా, ముగ్గురు సుఫారీ గ్యాంగ్ వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌కు చెందిన వ్యాపారవేత్త రాజా రఘువంశీ మే 11న సోనమ్‌ను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లారు. అక్కడ, మే 23న రాజా రఘువంశీని చంపినట్లు పోలీసులు ఛార్జిషీట్‌లో వివరించారు. ఈ హత్య వెనుక రాజా భార్య సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా చాలా నెలలుగా కుట్ర పన్నారని దర్యాప్తులో తేలింది. హనీమూన్ సాకుతో రాజాను మేఘాలయకు తీసుకెళ్లి, ముగ్గురు కిరాయి హంతకులను ఉపయోగించి హత్య చేయించారని పోలీసులు తెలిపారు.
🚨 Meghalaya Honeymoon Murder Case
— Vantage Monitor (@Vantagemonitor) September 7, 2025
Police have filed a 790-page chargesheet in the killing of Raja Raghuvanshi, naming wife Sonam Raghuvanshi, her lover Raj Kushwaha, and 3 hired assailants.
Key details:
🔹 Conspiracy hatched days after marriage
🔹 3 failed attempts before… pic.twitter.com/GqWMjJUlvK
పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో, ఈ కేసు విచారణలో సేకరించిన కీలక ఆధారాలు, నిందితుల కాల్ డేటా రికార్డులు, వారి మధ్య జరిగిన సంభాషణలు, మరియు హత్యకు దారితీసిన పరిస్థితుల గురించి విపులంగా వివరించారు. ఈ 970 పేజీల ఛార్జిషీట్‌లో హంతకులు ఈ హత్య కోసం మూడుసార్లు ప్రయత్నించి విఫలమయ్యారని, చివరికి నాలుగో ప్రయత్నంలో సక్సెస్ అయ్యారని కూడా పోలీసులు తెలిపారు.
ఈ ఛార్జిషీట్‌ను సమర్పించిన తర్వాత రాజా రఘువంశీ కుటుంబ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. రాజా సోదరుడు విపిన్ రఘువంశీ మీడియాతో మాట్లాడుతూ, నిందితులకు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. పోలీసులు సకాలంలో దర్యాప్తును పూర్తి చేసి, అన్ని ఆధారాలను సేకరించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం నిందితులందరూ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో త్వరలో విచారణ ప్రారంభం కానుంది.