Rashmika Mandanna: ఇదే నా లాస్ట్ సినిమా.. రిటైర్మెంట్ పై రష్మిక సంచలన ప్రకటన

ఛత్రపతి శివాజీ బయోపిక్ 'ఛావా' ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ రష్మిక కామెంట్స్ వైరల్ గా మారాయి. ఈ సినిమాలో శంభాజీ భార్య ఏసుబాయిగా అవకాశం దక్కడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపింది. ఇంతకు మించి ఏం కావాలి. ఈ సినిమా తర్వాత నేను సంతోషంగా రిటైర్ అవ్వగలను అంటూ చెప్పుకొచ్చింది.

New Update
rashmika latest insta post

actress rashmika mandanna

Rashmika Mandanna: రష్మిక మందన్న- బాలీవుడ్ హీరో  వీక్కీ కౌశల్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ఛావా. ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని డైరెక్టర్ లక్ష్మణ్‌ ఉటేకర్‌ తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా  ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్ . 

రిటైర్మెంట్ పై కామెంట్స్ 

అయితే ఈ ఈవెంట్ రష్మిక సినిమా నుంచి  రిటైర్మెంట్ పై కామెంట్స్ సరదాగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈవెంట్ లో రష్మిక మాట్లాడుతూ.. ఈ సినిమాలో శంభాజీ భార్య ఏసుబాయిగా పాత్రలో  అవకాశం దక్కడం గౌరవంగా భావిస్తున్నాను.  తెలిపింది. ఇంతకు మించి ఏం కావాలి. ఈ సినిమా తర్వాత నేను సంతోషంగా రిటైర్ అవ్వగలను అంటూ చెప్పుకొచ్చింది.

Also Read: Mythri Movie Makers: పుష్ప2 కు బిగ్ షాక్.. మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో ఐటీ దాడులు

ఇటీవలే మూవీ  నుంచి రష్మిక లుక్ పోస్టర్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది  ఇందులో రష్మిక ఛత్రపతి శివాజి సతీమణి మహారాణి ఏసుబాయి పాత్రలో కనిపించనుంది. పుష్ప సినిమతో పాన్ ఇండియా స్థాయిలో పాపులారైన రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. అటు టాలీవుడ్, ఇటు బాలీవుడ్ లో వరుస సినిమాలు లైన్లో పెట్టింది. హిందిలో ఛావా తో పాటు సికిందర్, థామ చిత్రాలు చేస్తోంది. ఇటు తెలుగులో ది గర్ల్ ఫ్రెండ్, కుబేర సినిమాలు చేస్తోంది.

Also Read: Sreeleela Photos: ఫొటోకొక్క ఫోజు.. బ్లూ షర్ట్ లో శ్రీలీల చూపులకు కుర్రాళ్ళు పడిపోవాల్సిందే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు