Meerpet Crime: భార్యను గోడకేసి కొట్టి.. మటన్ కత్తితో ముక్కలుగా నరికి.. కుక్కర్ క్రైమ్ స్టోరీలో విస్తుపోయే నిజాలు

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన కుక్కర్ క్రైమ్ స్టోరీలో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. అనుమానం కారణంగా ఆమెను గోడకేసి కొట్టి, ఆ తర్వాత మటన్ కత్తతో ముక్కలుగా చేశాడు. ఆధారాలు దొరకకూడదని, కుక్కర్‌లో వేసి, పొడి చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.

New Update

ప్రస్తుతం కుక్కర్ క్రైమ్ స్టోరీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. భార్యతో వివాదం వచ్చిందని ఆమెను అతి కిరాతకంగా చంపిన దారుణ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.  సంక్రాంతి పండుగ సందర్భంగా గురుమూర్తి అనే వ్యక్తి భార్య, పిల్లలతో కలిసి సంక్రాంతికి వస్తున్నామనే సినిమాకు వెళ్లారు. ఆ తర్వాత పిల్లలను అమ్మమ్మ ఇంట్లో విడిచి వారు ఇంటికి వెళ్లారు. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సినిమా నుంచి వస్తుండగా గురుమూర్తికి, భార్య వెంకట మాధవికి ఓ చిన్న గొడవ జరిగింది. ఇంటికి వచ్చాక ఆ గొడవ కాస్త ముదిరింది.

ఇది కూడా చూడండి: Meerpet Incident:'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా చూపించి.. భార్యను కుక్కర్లో ఉడికించి చంపిన భర్త!

అనుమానం కారణంగానే..

ఈ క్రమంలో  కోపంతో భార్యను గోడకేసి కొట్టడంతో ఆమె చనిపోయింది. ఆమె శవాన్ని ఎలాగైనా మాయం చేయాలని గురుమూర్తి ప్లాన్ చేసి పెద్ద స్కెచ్ వేశాడు. ఆమెను కత్తితో ముక్కలు చేసి, కుక్కర్‌లో వేసి ఆ తర్వాత పొడి చేశాడు. వాటిని కవర్‌లో వేసి ఇంటి దగ్గర ఉన్న ఓ చెరువులో పడేశాడు. ఇదంతా సంక్రాంతి సమయంలో జరిగింది. అనుమానం కారణంగానే ఇలా చేసినట్లు తెలుస్తోంది. అయితే ఎవరికి ఎలాంటి డౌట్ రాకుండా భార్యను చంపేసి, అత్తవారికి కనిపించడం లేదని తెలిపాడు. ఆమె ఇంట్లో కనిపించకపోయినా కూడా ఎవరూ ఆమె గురించి అడగలేదు. 

ఇది కూడా చూడండి: Meerpet Incident: 72 గంటలు భార్య శవాన్ని ఉడికించి.. ఆరబెట్టి పొడిచేసి.. ఇదొక భయంకరమైన హత్య!

జనవరి 18వ తేదీన మాధవి కనిపించడం లేదని, ఆమె తల్లి మీర్‌పేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇంట్లో గొడవ అయ్యి బయటకు వెళ్లిందని, మిస్సింగ్ కేసు ఫైల్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులకు సంచలన విషయాలు తెలిశాయి. సినిమా నుంచి వచ్చిన తర్వాత మాధవి ఇంట్లోకి వెళ్లింది. కానీ తిరిగి బయటకు వెళ్లనట్లు పోలీసులు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. కనీసం బయటకు వచ్చిందా అంటా అదీ లేదు. పోనీ ఇంటి నుంచి బయటకు వెళ్లే అవకాశం ఉందా? అంటే అలా కూడా లేదు.

ఇది కూడా చూడండి: Crime: ఈ కుక్కర్లోనే ఉడికించి.. ఫినాయిల్‌ తో కడిగి: వెలుగులోకి భయంకర నిజాలు!

దీంతో పోలీసులకు అనుమానం వచ్చి.. భర్త గురుమూర్తిని విచారించారు. ఈ క్రమంలో పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. భార్యను తానే చంపినట్లు ఒప్పుకున్నాడు. మటన్ కోసే కత్తితో ఆమెను దుంగపై ముక్కలుగా కోశాడు. వీటిని కుక్కర్‌లో వాటర్ లేకుండా చేశాడు. దాదాపుగా కొన్ని గంటల పాటు కుక్కర్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. అలాగే హీటర్ ద్వారా కూడా మాంసాన్ని ఉడికించి, ఆ తర్వాత పొడి తయారు చేశాడు. దీన్ని ఇంటి దగ్గర ఉన్న చెరువులో పడేశాడు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆమెను ప్లానింగ్ మీద చంపాడు. 

ఇది కూడా చూడండి: TG Schools: ప్రైవేట్ బడుల్లో వారికి ఉచిత చదువులు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!

#latest-telugu-news #telugu-news #crime news
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు