/rtv/media/media_files/2025/06/22/man-shoots-two-sisters-in-haryana-jind-2025-06-22-13-44-27.jpg)
man shoots two sisters in haryana jind
Crime News: హర్యానాలోని జింద్ జిల్లాలో పట్టపగలే దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఇద్దరు సోదరీమణులపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు యువతులూ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉంది. అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ చేటుచేసుకుంది. కాల్చి చంపింది మరెవరో కాదు.. స్వయానా బావే. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..నెలకు రూ.2,016 పెన్షన్
haryana jind
షిను (25), రీతు (23) అనే ఇద్దరు సోదరీమణులు జింద్ జిల్లాలో తమ ఫ్యామిలీతో నివసిస్తున్నారు. షీను బావమరిది సునీల్. వీరిలో నిందితుడు సునీల్ రీతును వివాహం చేసుకోవాలనుకున్నాడు. దీని కోసం సునీల్.. రీతు తల్లిదండ్రుల ముందు తన పెళ్లి ప్రతిపాదనను ఉంచాడు. కానీ రీతు కుటుంబం దానికి ఒప్పుకోలేదు.
Also Read: షాకింగ్ న్యూస్.. విమాన ప్రమాదంలో ప్రముఖ దర్శకుడి మృతి.. ఆలస్యంగా వెలుగులోకి..!
దీంతో వారు నిరాకరించడంతో సునీల్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ‘తనకు దక్కనిది ఎవరికీ దక్కనివ్వను’ అన్నట్లుగా ప్రవర్తించాడు. వారిద్దరినీ హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం షిను, రీతు సోదరీమణులు ఇంటికి తిరిగి వస్తుండగా.. మార్గమధ్యలో పిల్లు ఖేడా గ్రామంలోని రైల్వే స్టేషన్ దగ్గర నిందితుడు సునీల్ వారిపై కాల్పులు జరిపాడు. ఒక సోదరి కడుపుపై, మరొకరి మెడపై కాల్పులు జరిగాయి.
Also Read: హోటల్‌లో దంపతుల శృంగారం.. కిటికీలు వేసుకోవడం మర్చిపోవడంతో..?
అనంతరం సునీల్ అక్కడ నుంచి పరారయ్యాడు. గమనించిన స్థానికులు గాయపడిన ఇద్దరినీ సివిల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని పిజిఐఎంఎస్ రోహ్తక్ కు తరలించారు. ఇద్దరు సోదరీమణుల పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read : బేగంపేటలో భారీ చోరీ..ఏకంగా రూ.48లక్షలు కాజేసి..
 Follow Us