/rtv/media/media_files/2025/08/07/delhi-crime-2025-08-07-12-55-29.jpg)
దక్షిణ ఢిల్లీలో దారుణం జరిగింది. సాధువు వేషంలో వచ్చి భార్యను హతమార్చాడో భర్త. బీహార్‌కు చెందిన ప్రమోద్ ఝా(60), కిరణ్ ఝా(50) దంపతులకు కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. పదేళ్లుగా దూరంగా ఉంటున్నారు. భర్త పెట్టే చిత్రహింసలు తట్టుకోలేక పదేళ్ల క్రితమే ఢిల్లీకి వెళ్లిపోయింది భార్య కిరణ్ ఝా. కొడుకు దుర్గేష్, కోడలు కమల్ ఝాతో నెబ్ సరాయ్‌లో నివాసం ఉంటుంది. దుర్గేష్ బీహార్‌లోని దర్భంగాలో ఒక మైక్రోఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు.
Also read : ‘కూలీ’కి ఇక్కడ 'A' సర్టిఫికెట్.. అక్కడ మాత్రం U/A.. షాక్ లో తలైవా ఫ్యాన్స్..!
మారిపోయానంటూ సాధువు వేషం వేసి
ఇటీవల బంధువు అంత్యక్రియల కోసం బీహార్ వెళ్లింది కిరణ్ ఝా. తాను మారిపోయానంటూ సాధువు వేషం వేసి ఆమెను నమ్మించాడు భర్త ప్రమోద్ ఝా. ఆగస్టు 1న ఢిల్లీలో భార్య ఇంటికి వెళ్లిన ప్రమోద్ ఝా.. బీహార్ వచ్చి తనకు డబ్బు సంపాదించి పెట్టాలని ఒత్తిడి చేశాడు. అందుకు భార్య ఒప్పుకోకపోవడంతో సుత్తితో తల పగలగొట్టాడు ప్రమోద్ ఝా. భార్య చనిపోయిన అనంతరం ఇంటి నుంచి పరారయ్యాడు. కిరణ్‌ను తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఆమె కోడలు రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చింది.
నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారుల పోలీసులు. హత్యకు ఉపయోగించిన సుత్తి కిరణ్ గదిలో లభ్యమైందని పోలీసులు తెలిపారు. ఇంటి ముందు ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలోని ఫుటేజ్‌లో ప్రమోద్ తెల్లవారుజామున 12.50 గంటలకు బట్టలు మార్చుకుని బయటకు వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. అతని కదలికలను తెలుసుకోవడానికి రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినల్స్‌కు బృందాలను పంపించామని, నిందితుడిని అరెస్టు చేయడానికి తాము పని చేస్తున్నామని డీసీపీ తెలిపారు.
Also Read : ఇండియా-పాక్ సీజ్‌ఫైర్ ట్రంప్ సుంకాలకు మధ్య లింక్?.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!
బీహార్‌లో దారుణం
బీహార్‌లో దారుణం జరిగింది. వివాహిత సునీత (32) ఆమె ప్రియుడు షకీల్ (40)తో సన్నిహితంగా ఉండగా చూసిన గ్రామస్థులు వారిని పట్టుకున్నారు. అన్యమతస్థుడితో క్లోజ్ గా ఉందని స్థానిక పంచాయతీ ఆదేశాల మేరకు ఆ ఇద్దరికీ గుండు గీయించి, ముఖాలకు నల్లరంగు పూసి, మెడలో చెప్పుల దండలు వేసి ఊరేగించారు. కటిహార్ జిల్లా ఫల్కా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ప్రియుడి భార్య పరుగున పోలీస్‌స్టేషనుకు వెళ్లి సాయం కోరింది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరూ వివాహితులేనని వారికి పిల్లలు ఉన్నవారని, కొంతకాలంగా సంబంధంలో ఉన్నారని అన్నారు. దర్యాప్తు అనంతరం తగిన చర్య తీసుకొంటామని జిల్లా ఎస్పీ శిఖర్ చౌధరి వెల్లడించారు.