Coolie Latest Updates: ‘కూలీ’కి ఇక్కడ 'A' సర్టిఫికెట్.. అక్కడ మాత్రం U/A.. షాక్ లో తలైవా ఫ్యాన్స్..!

సూపర్ స్టార్ రజనీకాంత్, నాగార్జున నటించిన 'కూలీ'కు ఇండియాలో A సర్టిఫికేట్, ఓవర్సీస్‌లో U/A రేటింగ్ లభించాయి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్ యాక్షన్ మూవీ ఆగస్టు 14న విడుదలకానుంది. ఇప్పటికే ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.

New Update
Coolie Latest Updates

Coolie Latest Updates

Coolie Latest Updates: సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth), నాగార్జున(Nagarjuna) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కూలీ’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ రూపొందించిన ఈ మూవీ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. విడుదలకు వారం రోజుల ముందు నుంచే ఈ సినిమా అనేక చర్చల్లో నిలుస్తోంది.

సెన్సార్‌ బోర్డు ట్విస్ట్.. (Coolie USA Censor)

ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ఇండియా సెన్సార్ బోర్డు A సర్టిఫికేట్ జారీ చేసి రజిని అభిమానులకు షాకిచ్చింది. రజనీకాంత్ కెరీర్‌ మొదటి నుండి చూస్తే కూలీ తో కలిపి మొత్తం ఆరు 'A' సర్టిఫికెట్ సినిమాలు ఉన్నాయి. అయితే గత 36 ఏళ్లలో చూస్తే రజిని కి తొలి A సర్టిఫికేట్ సినిమా ఇదే కావడం విశేషం. ఇదిలా ఉండగా ఓవర్సీస్ సెన్సార్ మాత్రం రివర్స్ లో ఉంది, ఓవర్సీస్ సెన్సార్ బోర్డు కూలీకి  ‘U/A’ సర్టిఫికేట్ ఇచ్చింది, అది కూడా ఎలాంటి కట్‌లు లేకుండా.

ఓవర్సీస్ లో సినిమా నిడివి సుమారు 2 గంటలు 48 నిమిషాలు ఉండనుంది. ఇండియాలో ఈ చిత్రానికి A సర్టిఫికేట్ రావడానికి ముఖ్య కారణం వయోలెన్స్ సినిమాలో ఉన్న బలమైన యాక్షన్, హింసాత్మక సన్నివేశాలు ఉన్నాయని తెలుస్తోంది. డైరెక్టర్ లోకేష్ స్టైల్ లోనే ఈ సినిమా ఫుల్ మాస్‌గా ఉండేలా రూపొందినట్లు తాజాగా రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది..

Also Read: 'బాషా'ని మించేలా 'కూలీ' ఇంటర్వెల్.. గూస్‌బంప్స్ పక్కా!

Coolie USA Censor
Coolie USA Censor

A vs U/A 

A సర్టిఫికేట్- 18 ఏళ్ల పైబడిన వారు మాత్రమే సినిమాని చూడగలరు. సినిమా లో హింస, న్యూడిటీ, అసభ్య పదాలు ఉండే అవకాశం ఉంటుంది.

U/A సర్టిఫికేట్-  అందరూ చూడవచ్చు, కానీ 12 ఏళ్ల లోపు పిల్లలు పెద్దల సమక్షంలో మాత్రమే చూడాలి. ఇందులో కొంత హింస, లైట్ గా అడల్ట్ సీన్స్ ఉండవచ్చు.

Also Read: ‘కూలీ’ యూఎస్ ప్రీ-సేల్స్ ఊచకోత!! ఇదిరా అరాచకం అంటే..

ఇక కూలీ విషయానికొస్తే, ఇండియాలో A సర్టిఫికేట్ రావడంతో, కొంతమంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో స్పందిస్తూ  "పిల్లలతో కలిసి చూడాలంటే ఒక U/A వెర్షన్ కూడా రిలీజ్ చేయండి" అంటూ చిత్ర యూనిట్‌ను కోరుతున్నారు. అయితే, తక్కువ సమయంలో మరో వెర్షన్ తయారు చేయడం చాలా కష్టం. అసలే లోకేష్ తాను అనుకున్న కాదని అనుకున్నట్లు గానే చూపిస్తారు తప్ప అందులో నుంచి అసలు సీన్స్ ని కట్ చేయరు. కాబట్టి కూలీ సినిమా ఇండియాలో ఇంక U/A వెర్షన్ లేనట్టే.

ఓవర్సీస్‌లో కూలీ రికార్డ్ బుకింగ్స్‌..

ఇంకా సినిమా విడుదలకి వారం రోజులు సమయం ఉన్నా, ఓవర్సీస్ మార్కెట్‌లో మాత్రం కూలీ భీభత్సంగా రికార్డులు సృష్టిస్తోంది. ఉత్తర అమెరికాలో ప్రీమియర్ షోల కోసం ఇప్పటికే 50వేలకిపైగా టికెట్లు అమ్ముడయ్యాయని చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ ప్రీ సేల్స్ చూస్తే USA లో కూడా రజినీకి ఉన్న స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఏంటో అర్థ అవుతోంది. ఇలాగే దూకుడు కొనసాగిస్తూ కూలీ సినిమా విడుదల తర్వాత కూడా మరిన్ని సంచలన రికార్డులు సృష్టించడం ఖాయం.. 

అలాగే కూలీతో పాటు, వార్ 2 సినిమా కూడా అదే రోజున రిలీజ్ కు రెడీ అయ్యింది.. ఆగస్టు 14న ఈ రెండు సినిమాల జాతకాలు తేలనున్నాయి.. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం USA  ప్రీ సేల్స్ లో కూలీ కంటే వార్ 2 వెనకపడి ఉందని తెలుస్తోంది. మరి ఈ సినిమాలు రిలీజ్ తరువాత ఎన్ని రికార్డులను కొల్లకొడతాయో చూడాలి.

Advertisment
తాజా కథనాలు