/rtv/media/media_files/2025/08/07/application-for-residence-certificate-2025-08-07-10-13-56.jpg)
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న బీహార్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెడిడెన్సీ సర్టిఫికేట్ కలకలం రేపింది. యస్ మీరు చదివింది నిజమే.. బిహార్‌లో ట్రంప్ రెడిడెన్సీ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కాకపోతే ఈ విషయం ట్రంప్‌కు కూడా తెలియకపోవచ్చు. ప్రతీకార సుంకాలతో భారత్‌పై విరుచుకుపుడుతున్న ట్రంప్.. బీహార్‌లో ఎప్పటి నుంచి నివసిస్తున్నారని అనుకుంటున్నారా.. కానీ ఇది నిజం. ట్రంప్ పేరుతో రెసిడెంట్ సర్టిఫికెట్ కోసం ఆన్‌లైన్‌లో ఓ అప్లికేషన్ వచ్చింది. అది పరిశీలించిన అధికారులు తిరస్కరించారు. బీహార్ అధికారులు ఇటీవల ఓ కుక్కకు డాగ్ బాబు పేరుతో నివాస ధృవీకరణ పత్రం జారీచేసిన విషయం తెలిసిందే. అలాగే ట్రంప్‌కు కూడా రెసిడెన్సీ సర్టిఫికెట్ ఇప్పిందామని అనుకున్నాడో వ్యక్తి.. ఇంకేముంది అమెరికా అధ్యక్షుడికి నివాస ధృవీకర పత్రం కోసం దరఖాస్తు చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
#WATCH | Bihar | An application was given in Samastipur to make a residence certificate in the name of US President Donald Trump. (06/08) pic.twitter.com/SfW3dtPf2W
— ANI (@ANI) August 6, 2025
బిహార్‌లో ఓటరు జాబితా సమగ్ర సవరణతో అధికారులు బిజీగా ఉన్నారు. సమస్తీపుర్ జిల్లాలోని మొహియుద్దీన్‌నగర్ బ్లాకు ప్రభుత్వ పోర్టల్‌లో ట్రంప్ పేరు, ఫొటోతో ఉన్న ఓ నివాస దృవీకరణ దరఖాస్తు కంట్లో పడింది. హసన్‌పూర్‌లో ట్రంప్ నివసిస్తున్నట్లుగా అప్లికేషన్‌లో పేర్కొనడం చూసిన అధికారులు షాక్ అయ్యారు. వెంటనే దానిని తిరస్కరించారు. జూలై 29న వచ్చిన ఈ దరఖాస్తులో ట్రంప్ తండ్రి పేరు ఫ్రెడరిక్ క్రిస్ట్ అని, తల్లి మేరీ మెక్‌లాయిడ్ అని పేర్కొన్నారు. కాగా, ఈ వ్యవహారంపై ఐటీ చట్టం కింద కేసు నమోదుచేసిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Donald Trump