/rtv/media/media_files/2025/10/29/tension-wire-2025-10-29-07-39-08.jpg)
Bus Fire Accident: వలస కూలీలతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు హైటెన్షన్ విద్యుత్ తీగకు(High-Tension Wire) తగలడంతో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘోర దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, కూతురు సజీవ దహనం అయ్యారు. మరో 10 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ విషాదకర ఘటన రాజస్థాన్‌లోని(Rajasthan) జైపూర్ జిల్లా మనోహర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
Also Read: 'బాహుబలి: ది ఎపిక్' తుఫాన్.. యూట్యూబ్ ను షేక్ చేస్తున్న కొత్త ట్రైలర్..
Jaipur Bus Fire Accident : जयपुर के पास Manoharpur में हाईटेंशन तार से बस में लगी भयंकर आग!#manoharpur#jaipur#busfireaccident#latestnews#punjabkesaritvpic.twitter.com/bpXGNBvSCz
— Punjab Kesari (@punjabkesari) October 28, 2025
Also Read: సైక్లోన్ మొంథా ఎఫెక్ట్.. ఈ జిలాల్లో స్కూల్స్ క్లోజ్..!
ఈ బస్సు ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ జిల్లా నుంచి కూలీలను తీసుకుని రాజస్థాన్‌లోని ఇటుక బట్టీల వద్దకు బయలుదేరింది. బస్సు డ్రైవర్ టోల్ గేట్ ఫీజు (రూ. 100) ఆదా చేయడానికి హైవే కాకుండా పక్కదారిలో, మురికి రోడ్డులో బస్సును మళ్లించినట్లు సమాచారం. ఆ దారిలో ప్రమాదకరంగా కిందకు వేలాడుతున్న 11,000 వోల్టుల హైటెన్షన్ విద్యుత్ తీగకు బస్సు పైకప్పుపై ఉన్న సామగ్రి తగిలింది. బస్సు పైభాగంలో ఉన్న లోహపు లగేజీ బాక్సులు, కొన్ని ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు విద్యుత్ తీగకు తగలడం వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగి, పెద్ద పేలుడు సంభవించింది. క్షణాల్లో బస్సు మొత్తం మంటల్లో చిక్కుకుంది. మంటలు వ్యాపించగానే ప్రయాణికులు హాహాకారాలు చేస్తూ కిటికీల నుంచి బయటకు దూకారు. చాలా మంది సురక్షితంగా బయటపడగా, కొందరు లోపల చిక్కుకుపోయారు.
Also Read: తీరం దాటిన మొంథా తుపాను.. ఉరుములతో కూడిన అతి భారీ వర్షాలు..ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ!
కొందరి పరిస్థితి విషమం
ఈ ఘటనలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం పిలిభిత్‌కు చెందిన కూలీ నసీమ్ (50), అతని కూతురు సాహినమ్ (20) తీవ్రంగా కాలిపోయి సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. నసీమ్ భార్య నజ్మా సహా మరో పది మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: తుఫాన్ బీభత్సం కోనసీమలో పెను విలయం.. లైవ్ అప్ డేట్స్!
పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, స్థానికుల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. టోల్ ఫీజును తప్పించుకోవాలని డ్రైవర్ చేసిన నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. డ్రైవర్, కండక్టర్‌తో పాటు, కూలీలను రవాణా చేసిన ఇటుక బట్టీ యజమానిపై కూడా కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రాణాలతో బయటపడిన వారికి సమీపంలోని గ్రామస్తులు ఆహారం ఏర్పాటు చేశారు.
Follow Us