/rtv/media/media_files/2025/04/18/lIIFrW7LYybolwxbePRT.jpg)
mokka-jonna
Illegal Affair: ఓ భూమి విషయంలో మధ్యవర్తిగా ఉన్నాడు. కాదనకుండా అడిగితే అప్పు ఇచ్చాడు. అదే అప్పును ఆసరాగా చేసుకుని అప్పు తీసుకున్న వ్యక్తి భార్యను లొంగదీసుకున్నాడు. దీంతో ఇది ఆమె భర్తకు ఈ వ్యవహారం తెలియడంతో ఇద్దరిలో ఎవరో ఒకర్ని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ అతని భార్య అప్పు ఇచ్చిన వ్యక్తినే చంపేద్దా్ం.. మనమే కలిసుందామని భర్తకు సలహా ఇచ్చింది. ఇద్దరు స్కెచ్ వేశారు... ప్లా్న్ ప్రకారం మొక్కజొన్న చేను దగ్గరకు అతన్ని రప్పించి సైలెంట్ గా లేపేశారు. ఈ ఘటన మహబూబాబాద్(Mahabubabad) లో చోటుచేసుకుంది.
Also Read: చిరు ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్.. 8kలో 'స్టాలిన్' గ్రాండ్ రీ-రిలీజ్..!
మధ్యవర్తిగా ఉండి అక్రమ సంబంధం
మూడుచెక్కలపల్లి గ్రామానికి చెందిన బానోత్ జంపయ్య అనే వ్యక్తి ఐదేళ్ల క్రితం 23 గుంటల వ్యవసాయ భూమి కొనుగోలు చేశాడు. అంతేకాకుండా ఇంటి పనులు కూడా మొదలుపెట్టాడు. అయితే బానోత్ కొమ్మాలు(40) మధ్యవర్తిగా ఉండి రెండుసార్లు రూ.1.50 లక్షలు జంపయ్యకు అప్పుగా ఇప్పించాడు. దీనినే ఆసరా చేసుకుని జంపయ్య భార్య విజయతో కొమ్మాలు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న జంపయ్య పెద్ద మనుషుల దగ్గర పంచాయితి పెట్టించాడు. దీంతో కొమ్మాలుకు పెద్దమనుషులు రూ.70 వేలు జరిమానా విధించారు. అయితే అందరిముందు తన పరువు పోయిందని భావించిన జంపయ్య.. తన భార్యను లేదా కొమ్మాలును చంపాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయంలో భార్యతో గొడవ కాగా కొమ్మాలును చంపేద్దా్ం.. మనమే కలిసుందామని విజయ భర్తకు సలహా ఇచ్చింది.
Also Read: నందమూరి తమన్ మొదటి జీతం ఎంతో తెలిస్తే షాకే..!
దీంతో అనుకున్న ప్లాన్ ప్రకారం విజయ.. కొమ్మాలును నమ్మించి మొక్కజొన్న చేనులోకి రప్పించింది. అప్నటికే మాటు వేసి కూర్చున్న జంపయ్య కత్తులు తీసుకుని మొక్కజొన్న చేనులో వెళ్లి.. వెనుకవైపు నుంచి కొమ్మాలును కత్తితో పలుమార్లు పొడిచి చంపేశాడు. అనంతరం అక్కడినుంచి ఇద్దరు పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ రుద్రగూడెంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Also Read : ప్రభుత్వాన్ని పడగొడుతామంటే ఊరుకుంటామా? : రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
Also Read: Trump: ఇటలీ ప్రధాని మెలోని అంటే నాకు చాలా ఇష్టమంటున్న పెద్దన్న!