/rtv/media/media_files/2025/04/17/5kyN67Jy6dy88h3AtHRp.jpg)
Thaman
Thaman: టాలీవుడ్‌లో తమన్‌కు తిరుగులేని హిట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పేరొచ్చింది. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణతో కలసి చేసిన సినిమాలు వరుస విజయాలతో తమన్ కెరీర్‌లో ప్రత్యేక స్థానం సంపాదించాయి. ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’, తాజాగా ‘డాకు మహారాజ్’ సినిమాలతో తమన్-బాలయ్య(Balakrishna) కాంబినేషన్‌కి బ్రాండ్ వాల్యూ పెరిగింది. ఇప్పుడు అదే క్రేజీ కాంబో ‘అఖండ 2’(Akhanda 2) రూపంలో తిరిగొస్తోంది. ఈసారి తాండవం ఇంకెంత భీకరంగా ఉంటుందోనని అభిమానుల అంచనాలు ఇప్పటికే భారీగా పెరిగిపోతున్నాయి. థియేటర్ సౌండ్ సిస్టంలు ఈ బీజీఎమ్‌ను తట్టుకునేలా ఉండాలంటూ అభిమానులు సోషల్ మీడియాలో చర్చలు మొదలెట్టేశారు!
Also Read: ‘జటాయు’కి ప్రభాస్ సెట్ కాడు..
ఇక బాలయ్య- తమన్ బంధం గురించి చెప్పాలంటే స్వయంగా తన ఇంటిపేరు ‘నందమూరి’గా మార్చుకోవాలనుకుంటున్నట్టు కొన్ని సందర్భాల్లో తమన్ చెప్పారు. ఈ నిర్ణయంతో ఆయనకు బాలకృష్ణపై ప్రేమ, గౌరవం ఏ లెవెల్ లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ బంధం కొత్తగా ఏర్పడింది కాదు.
Also Read: యాక్షన్ షురూ.. ఎన్టీఆర్ - నీల్ సెట్ లో అడుగుపెట్టనున్న యంగ్ టైగర్
30 రూపాయల రెమ్యునరేషన్..
తమన్ సంగీత ప్రయాణం చాలా చిన్న వయస్సులోనే మొదలైంది. ఆయన తొలి ప్రాజెక్ట్ 1994లో వచ్చిన ‘భైరవ ద్వీపం’. ఆ సినిమాకి సంగీతం అందించిన మాధవపెద్ది సురేష్ చేతిలో తాను డ్రమ్మర్‌గా అవకాశం పొందాడు. తొలిరోజే 30 రూపాయల రెమ్యునరేషన్‌తో తమన్‌కు మొదటి అనుభవం ఎలాగైతే కలిసొచ్చిందో, అదే ఉత్సాహంతో తొమ్మిది రోజులు పనిచేశాడు. మొత్తం 270 రూపాయలు వచ్చాయి. అప్పటికి ఇది చిన్న మొత్తంగా కనిపించొచ్చు కానీ, ఇరవై ఏళ్ళు కూడా నిండని యువకుడికి అది గొప్ప అనే చెప్పొచ్చు.
Also Read: ఒక్క మాటతో ప్రభాస్ 'స్పిరిట్'ని ఆకాశానికి ఎత్తేసిన రాజమౌళి..
రెమ్యునరేషన్ విషయాన్ని ఆయన బయటకి చెప్పకపోయినా తాను గతంలో తన కెరీర్ ఎలా ప్రారంభించాడో మాత్రం ఓ ఇంటర్వ్యూలో యాంకర్ సుమతో చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంలో ఆయన సోషల్ మీడియాలో తనపై జరిగిన ట్రోలింగ్‌ను కూడా ప్రస్తావించారు. “గేమ్ ఛేంజర్” సినిమాపై రిలీజ్‌కి ముందే నెగెటివ్ క్యాంపైన్ జరగడంపై తమన్ బాధను వ్యక్తం చేశారు. ట్రోలింగ్ శృతిమించిందని, ఆ వ్యవహారం ఎంతో బాధించిందని చెప్పారు.
Also Read: వీకెండ్ కలెక్షన్స్ లో దుమ్ము దులిపేసిన ‘జాట్’..
ఇప్పటివరకు మ్యూజిక్ డైరెక్టర్‌గా సత్తా చాటిన తమన్ ఈ ఏడాది మరింత బిజీగా కాబోతున్నారు. ‘అఖండ 2’, పవన్ కళ్యాణ్ ‘ఓజీ’, ప్రభాస్ ‘ది రాజా సాబ్’తో పాటు, తమిళంలో ‘ఇదయం మురళి’ వంటి ప్రాజెక్టులపై పనిచేస్తున్నారు. విశేషం ఏంటంటే, ఈ తమిళ సినిమాలో తమన్ ఓ ఆర్టిస్ట్‌గా కూడా స్క్రీన్ మీద కనిపించబోతున్నారు. గతంలో ‘బాయ్స్’ సినిమాలో నటించిన ఆయనకి ఇది తిరిగి తెరపై రీ ఎంట్రీ అయినట్లే.