Madhya Pradesh : పెళ్లి కోసం లింగ మార్పిడి.. ప్రియుడు ఊహించని ట్విస్ట్

మధ్యప్రదేశ్‌లో ఓ ఇద్దరు యువకులు 10 ఏళ్ల నుంచి స్వలింగ సంపర్కంలో ఉన్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకోవడంతో ఓ యువకుడు లింగ మార్పిడి చేసుకున్నాడు. ఆ తర్వాత ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో లింగ మార్పిడి చేసుకున్న యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

New Update
Madhya Pradesh

Madhya Pradesh

ఈ మధ్య కాలంలో స్వలింగ వ్యక్తులు రిలేషన్‌లో ఉంటూ పెళ్లి చేసుకుంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న దారుణాల వల్ల చాలా మంది స్వలింగ సంపర్కాలను ఇష్టపడుతున్నారు. అయితే ఇలాంటి ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. ఓ ఇద్దరు యువకులు 10 ఏళ్ల నుంచి స్వలింగ సంపర్కంలో ఉన్నారు. జీవితాంతం కలిసి జీవించాలని, ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో వారిలో ఒక యువకుడు లింగ మార్పిడి చేసుకోవాలని అనుకున్నాడు. అందులో ఒక యువకుడు 25 ఏళ్ల వయస్సులో లింగ మార్పిడి చేసుకున్నాడు.

ఇది కూడా చూడండి:Uttarakhand: ఉత్తరాఖండ్‌లో భారీ వరద బీభత్సం.. నీట మునిగిన ఆలయాలు

ఇది కూడా చూడండి:Unwanted Hair: ముఖంపై అవాంచిత రోమాలా! లేజర్ చికిత్స సురక్షితమేనా?

లింగమార్పిడి తర్వాత హ్యాండ్ ఇచ్చిన..

ఇక వారిని జీవితాంతం ఎవరూ కూడా విడదీయలేరని అనుకున్నారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ వచ్చింది. లింగ మార్పిడి చేసుకున్న తర్వాత మరో యువకుడు పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు. దీంతో లింగ మార్పిడి చేసుకున్న యువకుడు వెంటనే పోలీసులను సంప్రదించాడు. తనపై అత్యాచారం, శారీరక వేధింపులకు పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. 

ఇది కూడా చూడండి:Shubman Gill: దూకుడు మీదున్న శుభమన్ గిల్.. డబుల్ సెంచరీతో రికార్డు

Advertisment
Advertisment
తాజా కథనాలు